Home /News /movies /

DIRECTOR BOBBY ANNOUNCE CHIRANJEEVI 154 MOVIE TITLE SB

Mega 154: చిరంజీవి సినిమా టైటిల్ ఇదే.. మెగా ఫ్యాన్స్ మీటింగ్‌లో చెప్పిన డైరెక్టర్

వెంకీ మామ లాంటి సినిమా తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం కూడా త్వరలోనే మొదలు కానుంది. వేదాళం సినిమాను మరికొంత ఆలస్యంగానే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్. ఈ లోపు బాబీతో పాటు లూసీఫర్ రీమేక్స్ పూర్తి చేయాలని చూస్తున్నాడు.

వెంకీ మామ లాంటి సినిమా తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం కూడా త్వరలోనే మొదలు కానుంది. వేదాళం సినిమాను మరికొంత ఆలస్యంగానే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్. ఈ లోపు బాబీతో పాటు లూసీఫర్ రీమేక్స్ పూర్తి చేయాలని చూస్తున్నాడు.

‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేశారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

    ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. తాజాగా మెగా 154 సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే.. మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అయితే, ఇది ఒరిజినల్ కథతో రూపొందుతోంది. పైగా.. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చెప్పడం, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ వైబ్స్‌ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా కోసం ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇకపోతే.. ఈ సినిమా టైటిల్‌పై చాలారోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేశారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఆచార్య ప్రమోషన్స్‌లో చిరు ఈ సినిమా టైటిల్‌ని లీక్ చేసేశారు. యువ దర్శకులతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తాను టైటిల్ చెప్పనని అంటూనే ‘వాల్తేర్ వీరయ్య’ అని నోరు జారారు. ఇప్పుడు దర్శకుడు బాబీ తమ సినిమా టైటిల్ అదేనంటూ ధృవీకరించాడు. విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో.. చిరుతో తాను చేస్తోన్న చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్‌ని ఫిక్స్ చేశామని క్లారిటీ ఇచ్చాడు.

    ఈ చిత్రంలో చిరు అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నార‌ని సమాచారం. విశాఖ‌ప‌ట్నం బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌తున్న ఈ సినిమిలో చిరు కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుంది. ఇందులో మాస్‌ మ‌హారాజ ర‌వితేజ కూడా ఓ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిరుతో శృతి జోడీ కట్టడం ఇదే మొదటిసారి. దీంతో.. తనయుడితో పాటు తండ్రితోనూ రొమాన్స్ చేసిన కథానాయికల జాబితాలోకి శృతి చేరిపోయింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుతున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Director bobby, Megastar Chiranjeevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు