ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అట్లీ తాత సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఇందుకు సంబంధించి అట్లీ ట్విట్టర్లో ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు. ఆయనతో దిగిన పోస్ట్ షేర్ చేసిన అట్లీ.. ‘నా తాత ఎం సౌందరా పాడియన్ కన్నుమూశారు. మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తాను. తాత మీరు ఎల్లప్పుడూ మా రాజు, రోల్ మోడల్. లవ్ యూ, మిస్ యూ.. మీ ఆత్మకు శాంతి కలగాలి’అని పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు.. సౌందరా పాండియన్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
My periyappa late justice M.Sowndra Pandian has passed away,Banyan of the whole family,Completely Devastated painful can’t take it & don’t know how to com over it,Love him the most,Periyappa ur always our king & role model, Love u & Will miss u , rest in peace... pic.twitter.com/LTvFXFQ9on
ఇక, శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా కేరీర్ ప్రారంభించిన అట్లీ.. ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమాయ్యాడు. తొలి చిత్రం రాజా రాణి చిత్రంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ అగ్ర హీరో విజయ్‌తో కలిసి వరుస చిత్రాలు చేశాడు. ఇక, త్వరలోనే విజయ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలో ఓ తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత తారక్.. విజయ్‌తో మల్టీ స్టారర్లో కనిపించనున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.