హోమ్ /వార్తలు /సినిమా /

Shankar-Atlee: గురువు శంకర్ దారిలో శిష్యుడు అట్లీ .. థమన్ సాయంతో..

Shankar-Atlee: గురువు శంకర్ దారిలో శిష్యుడు అట్లీ .. థమన్ సాయంతో..

గురువు శంకర్ బాటలో అట్లీ (File/Photo)

గురువు శంకర్ బాటలో అట్లీ (File/Photo)

Shankar-Atlee | ఈ మధ్యకాలంలో దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. అంతేకాదు తమ అభిరుచికి తగ్గట్టు తమ దర్శకత్వంలో సినిమాలు నిర్మించడమే కాదు.. కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తున్నారు. తాజాగా దర్శకుడు అట్లీ కూడా గురువు శంకర్ బాటలో పయనిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  Shankar-Atlee | ఈ మధ్యకాలంలో దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. అంతేకాదు తమ అభిరుచికి తగ్గట్టు తమ దర్శకత్వంలో సినిమాలు నిర్మించడమే కాదు.. కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తున్నారు. దాసరి, రామ్ గోపాల్ వర్మ నుంచి మొదలు పెడితే.. శంకర్ వరకు అందరు కొత్త దగ్గర పనిచేసే దర్శకులకు మెగాఫోన్ పట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. తాజాగా దర్శకుడు అట్లీ కూడా నిర్మాత అవతారం ఎత్తి వేరే వాళ్లతో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈయన ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న సినిమాక ‘అంధకారం’ అనే సినిమాకు దర్శకుడు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాను  ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.  వి విజ్ఞ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.

  Director Atlee Follows His Mentor director shankar in this way Here are the details,Atlee,Shankar,Atlee Shankar,Andhakaaram movie Teaser,Thaman,atlee shankar,kollywood,tollywood,అట్లీ,శంకర్,అట్లీ శంకర్,అట్లీ అంధకారం,గురువు శంకర్ బాటలో అట్లీ,అంధకారం,అంధకారం టీజర్,థమన్
  గురువు శంకర్ బాటలో అట్లీ (File/Photo)

  స్వామీరారా, పిజ్జా వంటి థ్రిల్ల‌ర్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన పూజా రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. పూజా రామచంద్ర‌న్ తో పాటు అర్జున్ దాస్, వినోత్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్ కూడా లీడ్ రోల్స్ లో న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సూప‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ని ప్ర‌ముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ టు ఓటిటి రిలీజ్ ప‌ద్థ‌తిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 24, 2020 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్  అవుతుంద‌ని నిర్మాత‌లు సుదాన్, ప్రియ అట్లీ తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే అంధ‌కారం చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభ‌కాంక్ష‌లు తెలియజేసారు.

  ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ ’అంధ‌గార‌మ్’ టీజ‌ర్ ని ప్ర‌ముఖ తమి‌ళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ విడుద‌ల చేయ‌డం విశేషం.

  టీజ‌ర్ మొత్తాన్ని స్ట‌న్నింగ్ విజువ‌ల్స్ తో, థ్రిల్లింగ్ సౌండ్ తో డిజైన్ చేసారు. చూసే ఆడియెన్స్ కి సినిమా మీద మ‌రింత ఉత్కంఠ క‌లుగుతుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Atlee, Kollywood, Shankar

  ఉత్తమ కథలు