HOME » NEWS » movies » DIRECTOR AR MURUGADOSS DOING A HOLLYWOOD MOVIE MS

AR Murugudoss: నెక్స్ట్ సినిమాను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న మురుగదాస్

సంచలనాల దర్శకుడు AR Murugudoss తదుపరి సినిమా ఏంటి? అనే దానిపై ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో మురుగదాస్ తదుపరి సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.

news18-telugu
Updated: December 1, 2020, 9:55 PM IST
AR Murugudoss: నెక్స్ట్ సినిమాను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న మురుగదాస్
ఎ.ఆర్.మురుగదాస్ (ఫైల్)
  • Share this:
ద‌క్షిణాదినే కాదు.. ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న సినిమాల‌తో మెప్పించిన అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల్లో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఒక‌రు. అయితే ఈ ద‌ర్శ‌కుడికి ఈ మ‌ధ్య ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఎందుకంటే.. స్పైడర్ నుండి ఈ దర్శకుడు చేస్తున్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు. విజయ్‌తోచేసిన సర్కార్ మూవీ మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా మినహా మరో సినిమా ఏదీ ప్రేఓకులను మెప్పించలేదు. ఈయన దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన ‘దర్భార్’ మూవీ కూడా అటు తలైవా అభిమానులనే కాదు.. ఇటు ఎ.ఆర్.మురుగదాస్ అభిమానులను కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు ఈయన తదుపరి ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం మేరకు మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ఈ మధ్య కాలంలో.. ముఖ్యంగా డిజిటల్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో సినిమాల మధ్య భాషకు సంబంధించిన అంతరం తగ్గిపోతుంది. మన దక్షిణాది దర్శకులు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. శంకర్ రోబో, రాజమౌళి బాహుబలి ప్రపంచ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇప్పుడు మురుగదాస్ కూడా వీరి బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నాడు. వాల్ డిస్నీ సంస్థతో కలిసి లైవ్ యాక్షన్ తరహా చిత్రాన్ని తెరకెక్కించడానికి మురుగదాస్ ప్రణాళికలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రారంభంలో మురుగదాస్ సినిమాలంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ‘గజినీ’ చిత్రంతో సూర్యను స్టార్ హీరో చేసిన మురుగదాస్ తను కూడా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత ఈయనతో హీరో విజయ్ చేసిన తుపాకీ సినిమా మరో సెన్సేషన్ హిట్ మూవీగా నిలిచింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో చేసిన ‘గజినీ’ రీమేక్ ఇండియాలో తొలి వందకోట్ల కలెక్షన్స్ సాధించి ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

తర్వాత ‘తుపాకీ’ చిత్రాన్ని కూడా ‘హాలీడే’ పేరుతో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. మరో వైపు నిర్మాతగానూ ‘రాజారాణి’, బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మధ్యలో కొన్ని సినిమాలు ఆడకపోయినా మరోసారి విజయ్‌తో మురుగదాస్ చేసిన కత్తి, సర్కార్ సినిమాలు ఆయన ఇమేజ్‌ను కాపాడాయి. అయితే మహేశ్‌తో చేసిన స్పైడర్, రజినీకాంత్‌తో చేసిన దర్బార్ సినిమాలు డిజాస్టర్‌లుగా నిలిచాయి. మరి ఇప్పుడు హాలీవుడ్‌ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన సినిమాలను అభిమానించే వారికి మాత్రం మురుగదాస్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎలా వస్తాడు? అనేది ప్రశ్నార్థకమే.
Published by: Anil
First published: December 1, 2020, 9:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading