DIRECTOR ANIL RAVIPUDI OPEN COMMENTS ON THIRD HERO IN F3 MOVIE SLB
F3 సీక్రెట్స్: మూడో హీరో కూడా ఉన్నాడా? ఉంటే ఎవరు? అనిల్ టెక్నిక్ అదుర్స్
Photo Twitter
Anil Ravipudi: గతంలో వచ్చి ఆడియన్స్‌ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన F2 సినిమాకు సీక్వల్గా F3 మూవీ రూపొందించిన అనిల్ రావిపూడి.. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మూడో హీరో విషయమై ఆయన రియాక్ట్ అయ్యారు.
కామెడీ పటాస్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) F3 రూపంలో మరో నవ్వుల రైడ్ మన ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో వచ్చి ఆడియన్స్‌ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన F2 సినిమాకు సీక్వల్గా F3 మూవీ రూపొందించిన ఆయన.. మే 27న ఈ సినిమాను (F3 Release Date) గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన అనిల్.. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా రాబోతున్న F3 సీక్రెట్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ జనం దృష్టి మొత్తాన్ని F3 వైపుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో మూడో హీరో ప్రస్తావన రావడంతో ఓపెన్ అయ్యారు.
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాకుండా మూడో హీరో కూడా ఉన్నాడా అనేది జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. తాజాగా దీనిపై వివరణ ఇస్తూ సినిమా సంగతులు చెప్పారు అనిల్ రావిపూడి. F3లో మూడో హీరోను పెట్టాలని అనుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పటికే ఇందులో కావాల్సినంత ఫన్ క్రియేట్ చేసాం ఇంకా మూడో హీరో ఎందుకని ఆ పాత్రను పక్కన పెట్టాం అని తెలిపారు అనిల్. అయితే రాబోయే F4లో మాత్రం కచ్చితంగా మూడో హీరోను పెడతాం అని చెప్పి ఇప్పటినుంచే F4పై టాక్ నడిచేలా చేశారు అనిల్ రావిపూడి.
F2లో భార్యాభర్తల ఫన్, ఫ్రస్ట్రేషన్ కీ పాయింట్ అయితే.. F3లో డబ్బు గురించి వచ్చే ఫ్రస్ట్రేషన్ మెయిన్ పాయింట్ అని అనిల్ రావిపూడి అన్నారు. డబ్బు చుట్టూ ఉండే ఆశ, అత్యాశ, కుట్ర, మోసం అన్నింటినీ కలగలుపుతూ కామెడీతో నవ్వించే సినిమానే ఇది అని తెలిపారు. F2 సక్సెస్‌తో హీరోహీరోయిన్లు ఈ సినిమాలో మరింత ఉత్సాహంగా నటించారని చెప్పారు. సునీల్, మురళీ శర్మ, ఆలీ కొత్తగా బరిలోకి దిగి మరింత ఫన్ పంచబోతున్నారని అన్నారు.
బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఆడిపాడుతున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీపై ఫ్యామిలీ ఆడియన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. సో.. చూడాలి మరి F3 ఫన్ రైడ్ ఏ మేర సక్సెస్ అవుతుందనేది!.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.