Home /News /movies /

DIRECTOR ANIL RAVIPUDI IS ALL SET TO BECOME AN ACTOR AFTER DIRECTING SNR

Anil Ravipudi : నెక్స్ట్ యాక్టింగ్ చేస్తానన్న అనీల్‌ రావిపూడి .. ముహుర్తం ఎప్పుడంటే

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Anil Ravipudi: అరడజను సినిమాలకు దర్శకత్వం వహించిన ఆ కుర్ర దర్శకుడు నటుడు కావాలని ముచ్చట పడుతున్నాడు. చూడటానికి కాస్త హీరో లుక్కులో కనిపించే డైరెక్టర్ ఎవరూ ..? షడన్‌గా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసా.

సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్‌ ఉండాలన్న...పబ్లిక్‌లోకి వెళితే సెల్ఫీలుSelfies, ఆటోగ్రాఫ్‌లు(Autographs), పాపులారిటీ, సెలబ్రిటీ(Celebrity)హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్‌ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీరోకే దక్కుతాయి. అందుకేనేమో...డైరెక్టర్‌గా చేసిన చాలా మంది హీరోలుగా, నటులుగా మారిపోయారు. అయితే అందులో అందరూ సక్సెస్‌ కాకపోయినప్పటికి కొందరు మాత్రం ఆడియన్స్‌ దగ్గర పాస్‌ మార్కులు వేయించుకున్నారు. ఈ లిస్ట్‌లోకి చేరిపోబోతున్నారు డైరెక్టర్ అనీల్‌ రావిపూడి(Anil Ravipudi). పటాస్(Patas),సుప్రీం(Supreme),రాజా ది గ్రేట్(Raja the Great), ఎఫ్‌2(F2), సరిలేరునీకెవ్వరూ(Sarilerunikevvaru), ఎఫ్‌3(F3), వంటి ఆరు హిట్‌ సినిమాలు తీసిన తర్వాత ఆయన దృష్టి నటనపై పడింది. అయితే ఇప్పుడంటే ఇప్పుడు కాదు..దర్శకత్వంలో ఆయన బాగా తృప్తి చెంది..ఆడియన్స్‌ ఇక చాల్లే అని ఫీలయ్యే వరకు సినిమాలకు దర్శకత్వం వహించి...అటుపై నటనలోకి దిగుతానని ప్రకటించారు.

అక్కడే సీక్రెట్‌ రివీల్ అయింది..
ఏబీఎన్‌ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ప్రోగ్రామ్‌ కోసం చేసిన ఇంటర్వూలో అనీల్‌రావిపూడి స్వయంగా తానే ఈ విషయాన్ని వెల్లడించారు. డైరెక్షన్‌ కాకుండా ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు అనీల్‌రావిపూడి నటుడిగా మారిపోతానంటూ ఆన్సర్ ఇచ్చారు. ప్రేక్షకులు తన సక్సెస్‌ చూసి ఇక చాలు అని ఫీలైతే చాలు డైరెక్షన్‌ వదిలేసి నటుడిగా మారిపోతానని మనసులో మాట ఆ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు.

ఆ కిక్కే వేరప్పా ..
సినిమాలకు దర్శకత్వం వహించే ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా తమను తాము స్క్రీన్‌పై చూసుకోవాలనే కోరిక ఉంటుంది. అందరి దర్శకులకు లేకపోయినా..కొందరికి మాత్రం తప్పకుండా ఉంటుంది. అందుకే వాళ్ల సినిమాలో ఏదో ఓ సీన్‌లో ఇలా కనిపించి ..అలా మాయమైపోతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణే వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, భీమనేని శ్రీనివాస్, గౌతమ్‌ మీనన్, శ్రీనువైట్ల, చాలా మంది వాళ్ల సినిమాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అనీల్‌రావిపూడి కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వాళ్లే ఇన్సిపిరేషన్..
గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి, భానుచందర్, కన్నడ హీరో ఉపేంద్ర, కమెడియన్ సునీల్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరియర్ బిగెన్ చేసి మాస్‌ మహారాజ్‌గా మారిన రవితేజ ఇలా చాలామంది వాళ్ల అభిరుచిని తీర్చుకొని ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు మరికొంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ అనీల్‌రావిపూడి కూడా రైటర్, డ్యాన్సర్‌తో పాటు మంచి కామిక్ టైమింగ్ ఉన్న వాడిలా కనిపిస్తుండంతో నటన వైపు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కోరిక తీర్చుకుంటే పోలా..
ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవాలంటే వారసత్వంతో పని లేదని చాలా మంది రుజువు చేశారు. నవరసాలు పండించే లక్షణాలు ఉంటే సరిపోతుందని సాధారణ నటుల నుంచి స్టార్ హీరోలైన వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొనే అనీల్‌రావిపూడి నటన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. పటాస్‌ సినిమాతో గట్టిగా పేలి హిట్ డైరెక్టర్‌గా ముద్రపడ్డ అనీల్‌రావిపూడి...నటుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో..జనం అతడ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Anil Ravipudi, Tollywood

తదుపరి వార్తలు