Home /News /movies /

DIRECOTR GAUTAM MENON AND ACTOR SURIYAS NAVARASA LOOK LEAKED BA

Suriya Navarasa: నవరసలో హీరో సూర్య లుక్ లీక్.. ఏం స్టైలిష్‌గా ఉన్నాడో..

హీరో సూర్య

హీరో సూర్య

నవరస సినిమాకు గౌతమ్ మీనన్ మాత్రమే డైరెక్టర్  కాదు. ఇదో సిరీస్. ఇందులో మొత్తం 9 భాగాలు ఉంటాయి. గౌతమ్ మీనన్‌తో పాటు మరికొందరు డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని ఎపిసోడ్స్‌లోనూ సూర్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

    కోలీవుడ్ హీరో సూర్య గురించి అందరికీ తెలిసిందే. అభిమానులను ఆకట్టుకోవడానికి తన లుక్స్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. ఆకాశం నీ హద్దురా సినిమాకు చాలా రఫ్ లుక్‌లో కనిపించిన సూర్య తన కొత్త సినిమా కోసం మళ్లీ లుక్ మార్చాడు. ఆ సినిమాలో ఉండే రఫ్ లుక్ నుంచి ఈసారి పూర్తి క్లాస్ లుక్‌లోకి వచ్చేశాడు. ఫుల్ క్లాస్ లుక్‌లో కనిపిస్తున్న లుక్ లీక్ అయింది. నవరస సిరీస్‌కు గౌతమ్ మీనన్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక సూర్య యాక్టింగ్ గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు కూడా ఫ్యాన్స్‌ని బాగా అలరించాయి. దీంతో మరోసారి వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద సినీ జనం బాగా అంచనాలు పెట్టుకున్నారు.

    నవరస సినిమాలో లీక్ అయిన స్టిల్‌ను బట్టి చూస్తే సూర్య గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపిస్తున్నాడు. రింగులు తిరిగిన జుట్టు, కండలు తిరిగిన దేహం, మీసాలు తీసేసి రాక్ స్టార్ లాగా కనిపిస్తున్నాడు. గౌతమ్ మీనన్ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీస్తుంటాడు. అలాగే, ఫ్రెష్ నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి గౌతమ్ మీనన్ సూర్యని ఎలా చూపించబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

    నవరస సినిమాలో సూర్య లుక్ (Image; Twitter)


    నవరస సినిమాకు గౌతమ్ మీనన్ మాత్రమే డైరెక్టర్  కాదు. ఇదో సిరీస్. ఇందులో మొత్తం 9 భాగాలు ఉంటాయి. గౌతమ్ మీనన్‌తో పాటు మరికొందరు డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని ఎపిసోడ్స్‌లోనూ సూర్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు. దీనికి మణిరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Kollywood News, Suriya

    తదుపరి వార్తలు