హోమ్ /వార్తలు /సినిమా /

హెబ్బా పటేల్‌తో రామ్ మాస్ రొమాన్స్.. అదిరిన డింఛక్ డింఛక్..

హెబ్బా పటేల్‌తో రామ్ మాస్ రొమాన్స్.. అదిరిన డింఛక్ డింఛక్..

రామ్ పోతినేని Photo : Twitter

రామ్ పోతినేని Photo : Twitter

ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ సినిమా నుండి ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ సినిమా నుండి ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘డింఛక్.. డింఛక్ అంటూ సాగిన ఈ మాస్ పాటలో రామ్ ఇరగదీశాడు. ఈ సందర్భంగా రామ్ సోషల్ మీడియా వేదికగా ‘రెడ్’ మూవీలోని పాటల్లో తనకు నచ్చిన ఓ సాంగ్ ఇది అంటూఓ పోస్ట్ లో పేర్కొన్నాడు. తమిళ సినిమా తడమ్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో నివేథా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌లో రామ్ మాస్ ఎనర్జీ స్టెప్స్ తో దుమ్ము రేపాడు. లైట్ హెయిర్, గుబురు గడ్డంలో పాటకు తగ్గట్టు ఆయన మాస్ లుక్ కేకగా ఉంది. రామ్‌కు జంటగా హెబ్బా పటేల్ హాట్ హాట్ డ్రెస్సులలో గ్లామర్ వలకబోసింది. మణిశర్మ సంగీతంగా అందించగా .. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించాడు. ఇక ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. రిలీజ్ ఎప్పుడనేది త్వరలో చిత్రబృందం వెల్లడించనుంది.

First published:

Tags: Hebah patel, Ram Pothineni, RED Movie

ఉత్తమ కథలు