DILRAJU EX PARTNER LAKSHMAN GOT A BLOCK BUSTER SUCCESS WITH JATHI RATHNALU MHN
Dil Raju - Lakshman: దిల్‌రాజుకి చెక్ పెడుతున్న మాజీ పార్ట్నర్..!
Dilraju ex partner Lakshman got a block buster success with jathi rathnalu
Dil Raju - Lakshman: నిర్మాత దిల్‌రాజు మాజీ పార్ట్నర్ లక్ష్మణ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారి చేసిన ‘జాతిరత్నాలు’ భారీ విజయాన్ని సాధించింది. దీంతో లక్ష్మణ్ చేయబోయే క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అందరూ మాట్లాడుకుంటున్నారు
ప్రస్తుతం ఉన్న తెలుగు అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఈయన కేవలం నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్ అలాగే ఎగ్జిబిటర్ కూడా. అయితే ఈ ఏడాది దిల్‌రాజుకు పెద్దగా కలిసొచ్చినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే నిర్మాణ పరంగా దిల్‌రాజు నిర్మించిన చిత్రాల్లో తొలి చిత్రంగా విడుదలైన షాదీ ముబారక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. పోనీ డిస్ట్రిబ్యూషన్ పరంగా అయినా దిల్‌రాజుకి సక్సెస్ దక్కిందా? అంటే అదీ లేదు. ఎందుకంటే ఈ ఏడాది దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఇప్పటికే దిల్‌రాజుకు నైజాం ఏరియా నుంచి వరంగల్ శ్రీను గట్టిపోటీనిస్తున్నాడు. సాధారణంగా దిల్‌రాజు చేతికి వెళ్లాల్సిన కొన్ని స్టార్ హీరోల ప్రాజెక్టుల నైజాం ఏరియా హక్కులన్నీ వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. పోనీ వరంగల్ శ్రీను కదా.. ఎలాగో చూసుకుందాంలే అని దిల్‌రాజు అనుకుంటే ఇప్పుడు దిల్‌రాజుకు మరో డిస్ట్రిబ్యూటర్ నుంచి పోటీ ఎదురవుతుంది. ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో కాదు.. లక్ష్మణ్. ఈయనెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ముగ్గురు నిర్మాతల్లో ఒకరు. ఏదో విబేదాల కారణంగా ఎస్వీసీ బ్యానర్ నుంచి బయటకు వచ్చి సొంత డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు లక్ష్మణ్.
Dilraju ex partner Lakshman got a block buster success with jathi rathnalu
తొలి సినిమాగా రీసెంట్గా విడుదలైన జాతిరత్నాలు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు లక్ష్మణ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో లక్ష్మణ్ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా దక్కించుకున్నాడట. ఈ సినిమాలు కూడా హిట్ అయితే ఇక లక్ష్మణ్‌కు తిరుగుండదు అని సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు. ఒక వైపు వరంగల్ శ్రీను, మరో వైపు లక్ష్మణ్ దిల్‌రాజుని డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో ఇబ్బంది పెడుతున్నవారే.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.