హోమ్ /వార్తలు /సినిమా /

Dilip Kumar Passes Away: లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..

Dilip Kumar Passes Away: లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..

దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి,ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు (File/Photo)

దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి,ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు (File/Photo)

Dilip Kumar Passes Away: బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రధాన మంత్రి,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు సహా రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

Dilip Kumar Passes Away: బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతిపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రధాన మంత్రి,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు సహా రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు. అంతేకాదు దిలీప్ కుమార్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న దిలీప్ కుమార్.. ఈ రోజు  ఉదయం  కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న దిలీప్ కుమార్ ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో జూన్ నెలలో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్ననప్పటికీ ఇతర సమస్యలు ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. గత వారం ముంబై శివారులోని హిందూజ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. దిలీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన భార్య సైరా భాను సోమవారం తెలిపారు. మీ అందరి ప్రార్థనల వల్ల దిలీప్ కుమార్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. కానీ ఇంతలోనే  ఆయన ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు మృతిపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ సంతాపం వ్యక్తం చేసారు. అటు లోకసభ స్పీకర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరి, రాజ్‌నాథ్ సింగ్‌, ప్రకాష్ జవదేకర్‌తో పాటు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, వెంకటేష్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ సంతాపం తెలియజేసారు. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.దిలీప్ కుమార్ సినీ ప్రస్థానం విషయానికొస్తే.. ఆరు దశాబ్ధాలకు పైగా సుధీర్ఘ సినీ జీవితం. 60 పైగా చిత్రాలు. ఎనిమిది ఫిలింఫేర్ పురస్కారాలు. మాగ్జిమమ్ అవార్డ్స్ సాధించినందుకుగానూ గిన్నీస్ బుక్‌లో స్థానం. ఇదీ నటుడిగా.. దిలీప్ కుమార్ స్టామినా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు.. పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా అనేక పురస్కారాలు.. ఇలా ఆయన కీర్తి కీరిటంలో లెక్కకు మించిన విశేషాలెన్నో. ‘వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ హిందీ సినిమా’గా పేరు గడించారు దిలీప్ కుమార్.

First published:

Tags: Amitabh bachchan, Bollywood news, Chiranjeevi, Dilip Kumar, Mahesh Babu, PM Narendra Modi, President of India, Tollywood, Venkaiah Naidu, Vice President of India

ఉత్తమ కథలు