Home /News /movies /

DILIP KUMAR PASSES AWAY LEGENDERY BOLLYWOOD TRAGEDY KING OF BOLLYWOOD AND HIS CINE JOURNEY TA

Dilip Kumar Passes Away: దిలీప్ కుమార్.. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్.. ఆయన సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నమూత (File/Photo)

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నమూత (File/Photo)

Dilip Kumar Passes Away | బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్  లేని బాలీవుడ్ సినిమాను ఊహించడం కష్టం. ముఖ్యంగా విషాద పాత్రలు షోషించడంలో ఆయనకు ఆయనే సాటి. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు అనారోగ్యంతో కాసేపటి క్రితమే అనారోగ్యంతో కన్నుమూసారు.

ఇంకా చదవండి ...
Dilip Kumar Passes Away | బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్  లేని బాలీవుడ్ సినిమాను ఊహించడం కష్టం. ముఖ్యంగా విషాద పాత్రలు షోషించడంలో ఆయనకు ఆయనే సాటి. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు. గ్రేట్ డైరెక్టర్ సత్యజిత్ రే చేత ‘అల్టిమేట్ యాక్టర్ ఫర్ ఎవర్’ గా  ప్రశంసలు పొందిన నటుడాయన. ఆయనే లెజండరీ యాక్టర్ ఆఫ్ బాలీవుడ్  పద్మవిభూషణ్ దిలీప్ కుమార్. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దిలీప్ కుమార్.. కాసేపటి క్రితమే అనారోగ్యంతో కన్నుమూసారు. వృద్ధాప్యంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ  దిలీప్ కుమార్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 98 ఏళ్లు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరు సంపాదించుకున్నారు.

దిలీప్ కుమార్ సినీ ప్రస్థానం విషయానికొస్తే.. ఆరు దశాబ్ధాలకు పైగా సుధీర్ఘ సినీ జీవితం. 60 పైగా చిత్రాలు. ఎనిమిది ఫిలింఫేర్ పురస్కారాలు. మాగ్జిమమ్ అవార్డ్స్ సాధించినందుకుగానూ గిన్నీస్ బుక్‌లో స్థానం. ఇదీ నటుడిగా.. దిలీప్ కుమార్ స్టామినా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు.. పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా అనేక పురస్కారాలు.. ఇలా ఆయన కీర్తి కీరిటంలో లెక్కకు మించిన విశేషాలెన్నో. ‘వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ హిందీ సినిమా’గా పేరు గడించారు దిలీప్ కుమార్.

దిలీప్ కుమార్


‘రాశి కంటే వాసి’కి ప్రాధాన్యమిచ్చిన రేర్ యాక్టర్ దిలీప్ కుమార్. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఇండియన్ సెల్యూలాయిడ్ వండర్. తరాలు మారినా.. ఆయన సినిమాల్లో వన్నె తగ్గలేదు. నేటికీ నిత్యనూతనంగా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నాయా చిత్రాలు. అదే దిలీప్ కుమార్  సినిమాల్లోని ఘనత. 1944లో ‘జ్వార్ భాటా’ తో మొదలైన ఆయన నటప్రస్థానం ‘ఖిలా’ సినిమా వరకు కొనసాగింది. నటన అనేది  దిలీప్ కుమార్ నరనరాల్లో ఉంది. ఆయన యాక్ట్ చేస్తే కేరెక్టర్ కళ్లకు కడుతుంది. కేవలం హావభావాలతో ప్రేక్షకులను అలరించడం దిలీప్ జీ స్పెషాలిటీ. ఎన్నో ఉదాత్త పాత్రలు పోషించి.. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన దిలీప్ కుమార్..1922, డిసెంబర్ 11న పాకిస్థాన్ లోని పెషావర్‌లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు.

దిలీప్ కుమార్


దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. వ్యాపార రీత్యా దిలీప్ ఫ్యామిలీ బాంబేకి షిప్ట్ అయింది. 1940లో దిలీప్ కుమార్.. పూనే మిలీటరీ కాంటీన్‌కు పండ్లు సప్లై చేసేవారు. ఆ కాంటీన్‌కు రెగ్యులర్‌గా వచ్చే  ప్రముఖ నటి దేవికారాణి, ఆయన భర్త హిమాంశురాయ్ దృష్టిలో పడ్డారాయన. అలా వారు తీయబోయే నెక్ట్స్ మూవీ ‘జ్వార్ భాటా’లో దిలీప్‌కు హీరోగా చాన్స్ ఇచ్చారు. ఆ మూవీకీ స్క్రిప్ట్ రాస్తున్న ప్రముఖ రచయత భగవతీ చరణ్ వర్మ, యూసఫ్ ఖాన్ స్క్రీన్ నేమ్.. దిలీప్ కుమార్‌గా ఛేంజ్ చేశారు.

ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్


తొలి  సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా నటుడిగా దిలీప్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. 1947లో విడుదలైన ‘జుగ్ను’ సినిమాతో ఆయన కెరీర్ టర్న్ తీసుకుంది. ఈ సినిమా విజయంతో దిలీప్ కుమార్ వెనుదిరిగి చూడలేదు. తర్వాతి రోజుల్లో రిలీజైన ‘దీదార్’, ‘అమర్’, ‘యాహుది’, ‘మధుమతి’, ‘దేవదాసు’ చిత్రాలు ఆయన నటజీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ సినిమాల సక్సెస్‌తో.. దిలీప్ బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరు సాధించారు. ఇక ‘దేవదాస్‌’లో దిలీప్ పోషించిన భగ్నప్రేమికుడి పాత్ర ఎంతో ప్రత్యేకం.

దిలీప్ కుమార్


‘దేవదాస్’గా దిలీప్ నటన ప్రేక్షకుల మదిలో పై చెరగని ముద్ర వేసింది. అప్పటికే  ఎందరో నటులు.. పోషించి మెప్పించిన ఆ పాత్ర.. ఎంతో హుందాగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దిలీప్ కుమార్.

నయాదౌర్ మూవీలో మధుబాలతో దిలీప్ కుమార్


దిలీప్ కుమర్ నటజీవితంలో.. మరో మచ్చుతునక ‘మొఘల్ ఎ ఆజం’ ఈ సినిమాలో సలీంగా ఆయన పోషించిన పాత్ర ఎవరూ మరిచిపోలేరు. అప్పటికే ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ కుమార్.. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. 2004లో ఈ సినిమా కలర్‌లో రిలీజ్ చేయగా.. 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలిచిందీ చిత్రం.

మొఘల్ ఏ ఆజం లో సలీంగా దిలీప్ కుమార్ (File/Photo)


ఇక బి.ఆర్.చోప్రా డైరెక్షన్‌లో.. దిలీప్ కుమార్ నటించిన ‘నయాదౌర్’ బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అప్పటి ప్రధాని నెహ్రు నుంచి.. ప్రత్యేక ప్రశంసలందుకుంది. ఈ మూవీ 2008లో రంగుల్లో విడుదలై మంచి విజయం సాధించింది.

నయాదౌర్‌లో దిలీప్ కుమార్


1967లో.. దిలీప్ కుమార్ డ్యూయల్ రోల్లో నటించిన ‘రామ్ ఔర్ శ్యాం’ సూపర్ హిట్టైయింది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించి సూపర్ హిట్టైన ‘రాముడు భీముడు’ హిందీ రీమేక్ లో...  దిలీప్ సాబ్ ఎంతో క్యాచీగా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన ‘దీదార్’, ‘బైరాగ్’ చిత్రాలు అనుకున్నంత సక్సెస్ కాలేదు. తర్వాత సినిమాలేం చెయ్యకుండా కొంత గ్యాప్ తీసుకున్నారు.

శక్తి మూేవీలో దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్


కొంత గ్యాప్ తర్వాత, అంటే 1981లో.. దిలీప్ కుమార్ మనోజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘క్రాంతి’ సినిమాలో నటించారు. ఈ మూవీ కూడా దిలీప్ కుమార్ కెరీర్‌లో మరో ఆణిముత్యం అని చెప్పాలి.  ఆ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో ఇది హయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సక్సెస్ తర్వాత దిలీప్ కుమార్ క్యారెక్టర్ నటుడిగా స్థిరపడ్డారు. దీంతో దిలీప్ కెరీర్ తిరిగి ట్రాక్‌లో పడింది.

మొఘల్ ఏ ఆజంలో దిలీప్ కుమార్


క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దిలీప్ నటించిన ఎన్నో చిత్రాలు.. బాక్సాఫీస్ హిట్  సాధించాయి. ఈ కోవలో ఆయన యాక్ట్ చేసిన ‘మషాల్’, ‘విధాత’, ‘కర్మ’, ‘సౌదాఘర్’ చిత్రాలు నటుడిగా ఆయన ఖ్యాతి మరింత పెంచాయి. దిలీప్ జీ యాక్ట్ చేస్తున్నారంటే, ఆ సినిమా సూపర్ హిట్ అనే పేరుండేది. 1966లో తనకన్నా 20 ఏళ్లు చిన్నదైన తోటి నటీమణిని సైరాబానును ప్రేమ వివాహం చేసుకున్నారు.

భార్య సైరాభానుతో దిలీప్ కుమార్


దిలీప్ జీ, నటుడిగా బాలీవుడ్‌కు చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. కేంద్రం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది.ఇంకోవైపు మహానటుడు దిలీప్ కుమార్‌కు వరించిన అవార్డులకు లెక్కలేదు. ఫిలింఫేర్ అవార్డులు స్టార్ట్ చేసినపుడు తొలి అవార్డు ఆయనే అందుకున్నారు. హిందీ చిత్రసీమకు దిలీప్ కుమార్ చేసిన సేవలకు గాను.... భారత ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు.. పద్మభూషణ్ సహా దేశ అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషణ్‌లతో గౌరవించింది. అంతేకాదు మన దాయాది దేశమైన పాకిస్థాన్ దిలీప్‌కుమార్‌ను ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ యే ఇంతియాజ్’ తో సత్కరించింది. సమైఖ్య ఏపీ గవర్నమెంట్ దిలీప్ కుమార్‌కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్‌తో సత్కరించింది. చలన చిత్ర ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఈ మహానటుడు నిష్క్రమణతో బాలీవుడ్‌లో ఓ శకం ముగిసిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Dilip Kumar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు