Home /News /movies /

DILIP KUMAR HOUSE IN PAKISTAN WHAT HAPPENED TO DILIP KUMARS PESHAWAR HOME AFTER THE ACTOR LEFT FOR INDIA IN 1935 TA GH

Dilip Kumar: దివంగత స్టార్​ హీరో దిలీప్​ కుమార్ పూర్వీకుల​ ఇళ్లు.. ఎక్కడుందో తెలుసా..?

ధిలీప్ కుమార్ (Dileep Kumar Photo : Facebook)

ధిలీప్ కుమార్ (Dileep Kumar Photo : Facebook)

దిలీప్​ కుమార్​ చిన్నతనంలో నివసించిన ఇంటిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పుట్టిపెరిగిన ఇళ్లు ఇప్పుడ?

Dilip Kumar: బాలీవుడ్​ దిగ్గజ నటుడు, భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరొందిన దిలీప్​ కుమార్​ ఇక లేరు. భారతీయ చిత్ర పరిశ్రమకు మెథడ్ యాక్టింగ్​ టెక్నిక్​ను పరిచయం చేసిన ఆయన గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ముంబైలోని హిందూజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7.30 నిమిషాలకు కన్ను మూశారు. దిలీప్​ కుమార్​ మరణ వార్తతో బాలీవుడ్​ చిత్ర పరిశ్రమ​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్గజ నటుడి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిలీప్​ కుమార్​ 1922 డిసెంబర్​ 11న పస్తుత పాకిస్థాన్ భూభాగం​లోని పెషావర్​లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్​ యూసఫ్​ ఖాన్​. సినిమాల్లోకి వచ్చాక దిలీప్​ కుమార్​గా పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి దిలీప్​ కుమార్​గానే ఫేమస్​ అయ్యారు. తన నటన, హావభావాలతో అశేషమైన అభిమాన గళాన్ని సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే, దిలీప్​ కుమార్​ చిన్నతనంలో నివసించిన ఇంటిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పుట్టిపెరిగిన ఇళ్లు ఇప్పుడు ఎలా ఉంది? అది ఎవరి స్వాధీనంలో ఉంది? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందర్లోనూ పెరిగింది. ఎందుకంటే ఈ ఇళ్లు ఇండియాలో లేదు. పాకిస్థాన్​లోని పెషావర్​లో ఉంది. దేశ విభజనకు ముందు అఖండ భారతంలో పెషావర్​ నగరం కూడా ఒక భాగం. కానీ స్వాతంత్ర్యం సిద్ధించాక.. ఇది పాకిస్థాన్​ భూభాగంలోకి వెళ్లింది.

Dilip Kumar Passes Away Legendery Bollywood Tragedy king of bollywood and His Cine Journey,Dilip Kumar Passes Away: దిలీప్ కుమార్.. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్.. ఆయన సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..,Dilip Kumar Passes Away,Dilip Kumar died,Dilip Kumar No More,Dilip Kumar Movies,Dilip Kumar Super Hits,Bollywood Legdendery Actor,Dilip Kumar Saira Bhanu,Bollywood,దిలీప్ కుమార్,బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత,బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇక లేరు,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ ఇక లేరు,దిలీప్ కుమార్ సినిమాలు,దిలీప్ కుమార్ నట ప్రస్థానం,పద్మవిభూషణ్ దిలీప్ కుమార్
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నమూత (File/Photo)


వారసత్వ కట్టడంగా ప్రకటన..పెషావర్​లోని ప్రఖ్యాత క్విస్సా ఖవానీ బజార్​లో దిలీప్​ కుమార్​ పూర్వీకుల ఇళ్లు ఉంది. ఈ ఇళ్లు అతడి తండ్రి, తాతల కాలం నాటిది. అక్కడే ఆయన జన్మించారు. ఆ తర్వాత 1940లో పుణేకి వచ్చి కాలక్రమంలో ఆనాటి బాంబే నగరానికి చేరుకున్నారు. 1947లో భారత్​ రెండుగా ముక్కలై పాకిస్థాన్​ ఏర్పడ్డాక దిలీప్​ కుమార్​ తిరిగి తన సొంతింటికి ఎప్పుడూ వెళ్లలేదు. అలా తన చిన్నతనంలో నివసించిన ఇల్లు అక్కడే మిగిలిపోయింది. అయితే పాకిస్థాన్​ ప్రభుత్వం దీన్ని త్వరలోనే మ్యూజియంగా మార్చనుంది.

dilip kumar health update,dilip kumar saira banu,dilip kumar hospitalized,dilip kumar hospitalised,dilip kumar in hospital,dilip kumar health condition,dilip kumar and saira banu,dilip kumar age,దిలీప్ కుమార్,దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమం,బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్


ఈ ఇంటిని 2014లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం జాతీయ వారసత్వం కట్టడంగా ప్రకటించింది. ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్న వారితో చర్చలు జరిపి, ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత దీన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ఇళ్లు కూలిపోయే దశలో ఉంది. కాగా, దిలీప్​ కుమార్​ పూర్వీకుల ఇంటిని వారసత్వ కట్టడంగా ప్రకటించడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్​ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Dilip Kumar

తదుపరి వార్తలు