Home /News /movies /

Vakeel Saab Sequel: ‘వకీల్ సాబ్’ సీక్వెల్‌కు దిల్ రాజు ప్లాన్.. ? పవన్ కళ్యాణ్ ఓకే చెబుతారా.. ?

Vakeel Saab Sequel: ‘వకీల్ సాబ్’ సీక్వెల్‌కు దిల్ రాజు ప్లాన్.. ? పవన్ కళ్యాణ్ ఓకే చెబుతారా.. ?

వకీల్ సాబ్ (Vakeel Saab Collections)

వకీల్ సాబ్ (Vakeel Saab Collections)

Vakeel Saab Sequel: ‘వకీల్ సాబ్’ సీక్వెల్‌కు దిల్ రాజు ప్లాన్.. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా సీక్వెల్‌కు ఓకే చెబుతారా.. ? ఇపుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

    Pawan Kalyan - Dil Raju - Vakeel Saab | ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వేరే భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేయడం లేదా ఆ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్స్ తెరకెక్కించడం గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జరగుతూనే ఉంది. తాజాగా గత నెల ఏప్రిల్ 9న విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాకు మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. హిందీలోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించలేదు. కానీ తెలుగులో దిల్ రాజు.. ఇపుడు ‘వకీల్ సాబ్’ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శకుడు శ్రీరామ్ వేణుతో కథను రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ పూర్తైయిన తర్వాత పవన్ కళ్యాణ్‌ను వినిపించాలనుకుంటున్నారు దిల్ రాజు. మరి పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి సీక్వెల్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

    గతంలో పవన్ కళ్యాణ్.. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సీక్వెల్ తెరకెక్కిస్తే.. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇపుడు ‘వకీల్ సాబ్’ సీక్వెల్‌తో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ నటించిన ’వకీల్ సాబ్’ మూవీని ముందుగా 50 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. తీరా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ  సినిమాను అనుకున్న దాని కంటే ముందుగానే ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు ఇచ్చేసారు దిల్ రాజు.

    Pawan Kalyan - Dil Raju Overseas Distrubutors angry on Dil Raju Due To Vakeel Saab OTT Release With in Three Weeks,Pawan Kalyan - Dil Raju: పరేషాన్‌లో దిల్ రాజు.. కారణం పవన్ కళ్యాణ్.. షాక్‌లో ఫ్యాన్స్..,Vakeel Saab Amzon Prime,Vakeel Saab Amzon Prime Release Date,Vakeel Saab Streaming Date On Amazon Prime,Vakeel Saab Collections,Pawan Kalyan Vakeel Saab Us premiere collections , Vakeel saab release date, vakeel saab news, vakeel saab digital streaming rights, vakeel saab digital rights, amazon prime, shruti haassan, dil raju, sreeram venu, pink remake, Pawan Kalyan, Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ డేట్,వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే తేది ఖరారు
    వకీల్ సాబ్ (Vakeel Saab)


    ఐతే.. వకీల్ సాబ్ సినిమాను రెండు వారాల తర్వాత అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దిల్ రాజు ఈ రూమర్స్‌‌ను ఖండించారు. 50 రోజుల తర్వాత ఈ సినిమాను అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు మరోసారి ప్రకటించారు. కానీ ఇపుడు మనసు మార్చుకొని సినిమా విడుదలైన 21 రోజుల తర్వాత ఈ సినిమాను అమెజాన్‌లో విడుదల చేస్తున్నారు. ఇక్కడే దిల్ రాజుకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ సినిమాను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌కు 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు. తీరా ఇపుడు మూడు వారాల తర్వాత విడుదల చేయడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ‘వకీల్ సాబ్’ మూవీ


    మరోవైపు ఓవర్సీస్‌లో ‘వకీల్ సాబ్’ సినిమా అనుకున్నంత రేంజ్‌లో పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా రీమేక్ సినిమా కావడం.. కోవిడ్ తదితర కారణాలతో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయింది. దీంతో వకీల్ సాబ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను మూట కట్టుకున్నారు.  మరోవైపు ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు దిల్ రాజు.. తమకు రూ. 3 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే..  ఈ విషయమై వారు కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టు సమాచారం. మరి ఈ విషయమై దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dil raju, Pawan kalyan, Tollywood, Vakeel Saab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు