Home /News /movies /

DIL RAJU TO PRODUCER PRABHAS PRASHANT NEEL FILM READ FULL DETAILS HERE MNJ

Prabhas- Prashant Neel- Dil raju: 'స‌లార్' కాంబోతో బడా నిర్మాత దిల్ రాజు మూవీ.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న

ప్రశాంత్ ప్రశాంత్ నీల్ దిల్ రాజు

ప్రశాంత్ ప్రశాంత్ నీల్ దిల్ రాజు

Prabhas- Prashant Neel- Dil raju: బాహుబ‌లి, సాహో సినిమాలతో వ‌చ్చిన గ్యాప్‌ను త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌ని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్లాన్ చేసుకున్న‌ట్లు ఉన్నారు. అందుకే వ‌రుస సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ వాటిలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్.. రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్, ప్ర‌శాంత్ నీల్‌తో స‌లార్, ఓమ్ రౌత్‌తో ఆది పురుష్ చిత్రాల్లో న‌టిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Prabhas- Prashant Neel- Dil raju: బాహుబ‌లి, సాహో సినిమాలతో వ‌చ్చిన గ్యాప్‌ను త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌ని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్లాన్ చేసుకున్న‌ట్లు ఉన్నారు. అందుకే వ‌రుస సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ వాటిలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్.. రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్, ప్ర‌శాంత్ నీల్‌తో స‌లార్, ఓమ్ రౌత్‌తో ఆది పురుష్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. వీటితో పాటు మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌తో ఓ మూవీలో న‌టించ‌నున్నాడు. ఇవి అన్ని పూర్తి అయ్యి, విడుద‌ల అయ్యేందుకు మ‌రో ఏడాది ప‌ట్టొచ్చు. అయితే ఈలోపే మ‌రో సినిమాకు ప్ర‌భాస్ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్‌తోనే ప్ర‌భాస్ రెండోసారి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్న‌ట్లు టాక్. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు తెలుస్తోంది.

    కాగా ప్ర‌భాస్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో సినిమా గురించి ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాహుబ‌లి త‌రువాత నుంచి వీరిద్ద‌రి కాంబోలో సినిమా రాబోతున్న‌ట్లు ప‌లుమార్లు పుకార్లు వినిపించాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి కాంబో ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే దిల్ రాజు ప్ర‌భాస్‌తో మున్నా, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. అందులో మున్నా యావ‌రేజ్‌గా అవ్వ‌గా.. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబోలో మూడో చిత్రం రానుందేమో చూడాలి.

    ఇక మ‌రోవైపు దిల్ రాజు, బోనీ క‌పూర్‌తో క‌లిసి నిర్మించిన పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రం వ‌కీల్ సాబ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఎఫ్ 3ను ఆయ‌న నిర్మిస్తున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించనున్న చిత్రాన్ని దిల్ రాజునే నిర్మిస్తున్నారు. వీటితో పాటు హిందీలో ఎఫ్ 2, జెర్సీ రీమేక్‌ల‌ను ఆయ‌న నిర్మిస్తున్నారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Dil raju, Prabhas, Prashant Neel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు