పవన్ కళ్యాణ్ అయిపోయాడు.. నెక్ట్స్ టార్గెట్ చిరంజీవి, బాలకృష్ణనేనా..

అవును పవన్ కళ్యాణ్ అయిపోయాడు. ఇపుడా ఆయన టార్గెట్ తెలుగు సీనియర్ హీరోలైనా బాలకృష్ణ, చిరంజీవి మిగిలారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 26, 2020, 8:38 AM IST
పవన్ కళ్యాణ్ అయిపోయాడు.. నెక్ట్స్ టార్గెట్ చిరంజీవి, బాలకృష్ణనేనా..
పవన్, బాలయ్య, చిరు (ఫైల్ ఫోటోస్)
  • Share this:
అవును పవన్ కళ్యాణ్ అయిపోయాడు. ఇపుడా ఆయన టార్గెట్ తెలుగు సీనియర్ హీరోలైనా బాలకృష్ణ, చిరంజీవి మిగిలారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా దిల్ రాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాల వల్లే వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడింది. ఐతే.. తాజాగా మారిన షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా విడుదల అనేది ఎపుడు అనేది త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్‌తో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంతో దిల్ రాజు ప్రస్తుతం తెలుగు యంగ్ హీరోలందరితో సినిమాలను తెరకెక్కించిన నిర్మాతగా రికార్డులకు ఎక్కాడు. వకీల్ సాబ్ విషయానికొస్తే.. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. తమిళంలో ఈ చిత్రాన్ని ’నేర్కొండ పార్వాయి’గా తెరకెక్కిస్తే మంచి సక్సెస్ సాధించింది.

వకీల్ సాబ్ పోస్టర్ Maguva Maguva song release
వకీల్ సాబ్ పోస్టర్ Maguva Maguva song release


అంతేకాదు సీనియర్ టాప్ హీరోలైన వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్2’ సినిమాలను తెరకెక్కించాడు. మరోవైపు నాగార్జునతో కూడా ‘గగనం’ సినిమాను తీసిన ట్రాక్ రికార్డు  దిల్ రాజు సొంతం. ఇక  దిల్ రాజు లిస్టులో తెలుగులో అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి మాత్రమే సినిమాలు చేయలేదు. ఇపుడు ఆ లోటును వీళ్లతో సినిమాలు తెరకెక్కించి తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే దిల్ రాజు ఈ హీరోల ఇమేజ్ తగ్గ కథను రెడీ చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం.  మొత్తానికి దిల్ రాజు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించేందుకు మంచి ప్లాన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు