• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • DIL RAJU TO PRODUCE NAANDHI HINDI REMAKE WITH RRR STAR AJAY DEVGN HERE ARE THE DETAILS SR

RRR | Dil Raju : ఆర్ ఆర్ ఆర్ స్టార్‌తో జత కడుతున్న దిల్ రాజు.. అధికారిక ప్రకటన విడుదల..

Ajay Devgn and Dil Raju Photo : Twitter

RRR | Dil Raju : తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను హిందీలో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అక్కడ మంచి విజయాలను కూడా అందుకున్నారు

  • Share this:
    తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను హిందీలో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అక్కడ మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు రీమేక్ అవ్వగా.. మరో మూవీ రీమేక్‌కు సిద్ధమవుతుంది. అల్లరి నరేష్ నటించిన కోర్ట్ డ్రామా నాంది (Naandhi Hindi Remake) చిత్రం ఆ మధ్య విడుదలై మంచి విజయం సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ  సినిమాలో నరేష్‌, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్‌ (Ajay Devgn) నటిస్తుండగా.. దిల్ రాజు (Dil Raju ) ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమాను పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్‌తో కలిసి అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నారు. అజయ్ దేవగణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్‌లో కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో చర్చించారు.


    ఇక ‘దిల్’ రాజు విషయానికి వస్తే.. ఇప్పటికే ఆయన పలు తెలుగు సూపర్ హిట్ చిత్రాలను హిందీలో నిర్మిస్తున్నారు. అందులో భాగంగా నాని సెంటిమెంటల్ హిట్ సినిమా ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సినిమాతో పాటు ‘దిల్’ రాజు విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీంతో ఆయన బ్యానర్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను కూడా రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుత దిల్ రాజు తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆయన నిర్మాణంలో ఇటీవల వకీల్ సాబ్ వచ్చి మంచి విజయం అందుకుంది. దీంతో ప్రస్తుతం ఎఫ్ 3 అనే సినిమా నిర్మాణంలో ఉంది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: