ఆయన టార్గెట్ చిరంజీవి, బాలకృష్ణ లేనా.. లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా..

అవును దిల్ రాజు ఇపుడు బాలకృష్ణ, చిరంజీవిలను టార్గెట్ చేసాడు. వీళ్లిద్దరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: August 5, 2019, 3:19 PM IST
ఆయన టార్గెట్ చిరంజీవి, బాలకృష్ణ లేనా.. లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా..
పవన్, బాలయ్య, చిరు (ఫైల్ ఫోటోస్)
news18-telugu
Updated: August 5, 2019, 3:19 PM IST
అవును దిల్ రాజు ఇపుడు బాలకృష్ణ, చిరంజీవిలను టార్గెట్ చేసాడు. వీళ్లిద్దరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసాడు. వివరాల్లోకి వెళితే..  తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు దిల్ రాజు సక్సెస్‌పుల్ నిర్మాతగా డిస్టిబ్యూటర్‌గా ఎగ్జిబిటర్‌గా రాణిస్తున్నాడు. తెలుగు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితో సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించిన ట్రాక్ రికార్డు  దిల్ రాజు సొంతం. అంతేకాదు సీనియర్ టాప్ హీరోలైన వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్2’ సినిమాలను తెరకెక్కించాడు. మరోవైపు నాగార్జునతో కూడా ‘గగనం’ సినిమాను తీసిన చరిత్ర  దిల్ రాజు సొంతం. మరోవైపు తెలుగులో అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మాత్రమే సినిమాలు చేయలేదు. ఇపుడు ఆ లోటును వీళ్లతో సినిమాలు తెరకెక్కించి తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే దిల్ రాజు.. బాలయ్యతో ‘లాయర్ సాబ్’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్,తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా ‘నేర్‌కొండ పార్వాయి’ గా రీమేక్ అయింది. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కానుంది. 

dil raju to produce films with tollywood top senior heroes balakrishna chiranjeevi and pawan kalyan here are the details,balakrishna new film with dil raju,dil raju balakrishna,balayya,nbk,balakrishna as lawyer saab,chiranjeevi,balakrishna,dil raju,pawan kalayan,pawan kalyan,Balayya new film lawyer saab,Balayya lawyer saab,dil raju Balayya lawyer saab,Nandamuri Balakrishna,Amitabh bachchan,Nandamuri Balakrishna Amitabh bachchan,balayya,nbk,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,Amitabh bachchan twitter,Amitabh bachchan instagram,Amitabh bachchan facebook,balakrishna remake pink,balakrishna will remake pink movie,balakrishna political,balakrishna controversy,balakrishna court,balakrishna movies,balakrishna ks ravikumar movie,tollywood,telugu cinema,big b,big bachchan,andhra pradesh news,andhra pradesh politicsbalakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,pawan kalyan dil raju,chiranjeevi dil raju,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,అమితాబ్ బచ్చన్,బాలకృష్ణ అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,బిగ్ బీ పింక్ రీమేక్‌లో బాలకృష్ణ,పింక్ రీమేక్‌ బాలయ్య,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,చిరంజీవి,పవన్ కళ్యాణ్,దిల్ రాజు చిరంజీవి,దిల్ రాజు పవన్ కళ్యాణ్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బాలయ్య, దిల్ రాజు (ఫైల్ ఫోటో)


ఇపుడు అదే సినిమాను తెలుగులో ‘లాయర్ సాబ్‌’ బాలయ్య హీరోగా తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ  సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇక బాలయ్య కూడా ఒకవేళ ఈ రీమేక్‌కు ఓకే చెబితే.. ‘ధర్మక్షేత్రం’ తర్వాత లాయర్‌గా నటించబోతున్న సినిమా ఇదే అవుతోంది. మరోవైపు దిల్ రాజు బాలకృష్ణ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మరోవైపు దిల్ రాజు పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆయనతో సినిమా నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పారు. మొత్తానికి దిల్ రాజు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించేందుకు మంచి ప్లాన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది.

First published: August 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...