DIL RAJU TO INTRODUCE COMEDIAN VENU AS DIRECTOR READ FULL DETAILS HERE MNJ
Dil Raju: జబర్దస్త్ కమెడియన్ని దర్శకుడిగా పరిచయం చేయనున్న దిల్ రాజు.. త్వరలోనే అధికారిక ప్రకటన
Dilraju ex partner Lakshman got a block buster success with jathi rathnalu
Dil raju: కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఇప్పుడు ఓ కమెడియన్ని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ కమెడియన్ చెప్పిన కథ దిల్ రాజుకు నచ్చిందని, దాన్ని నిర్మించేందుకు ఆయన ముందుకు వచ్చారని సమాచారం.
Dil Raju- Comedian Venu: టాలీవుడ్లో బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలోనే దాదాపుగా స్టార్ హీరోలందరితో సినిమాలను నిర్మించారు. ఇప్పటికీ నిర్మిస్తున్నారు. అంతేకాదు సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, సతీష్ వేగష్న, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల వంటి పలువురు సక్సెస్ఫుల్ దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఇక ప్రస్తుతం టాప్ నిర్మాతగా కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ కొత్త వారికి అవకాశాలను ఇస్తున్నారు. కథ నచ్చితే చాలు వారికి అవకాశం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోన్న సమాచారం ప్రకారం దిల్ రాజు ఇప్పుడు ఓ జబర్దస్త్ కమెడియన్ని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్‌లో టాప్ కమెడియన్‌గా దూసుకుపోయిన వేణు, ఇటీవల దిల్ రాజుకు ఒక కథను చెప్పారట. ఆ కథ దిల్ రాజుకు బాగా నచ్చిందని, దాన్ని తానే నిర్మిస్తానని అతడికి మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేణు దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటున్నారట. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే వేణుకు బిగ్ ఆఫర్ వచ్చినట్లే.
Comedian Venu as director
ఇదిలా ఉంటే చిత్రం శ్రీను అసోసియేట్‌గా వేణు సినిమా కెరీర్‌ని ప్రారంభించాడు. జబర్దస్త్‌లో పాల్గొనడం ద్వారా అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా రాగా.. పలు మూవీల్లో వేణు నటించి మెప్పించారు. అంతేకాదు స్టేజ్‌పైన పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ఏ షోలోనూ పాల్గొనని త్వరలోనే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.