టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు (Dil Raju) హీరోగా (Hero) చేస్తున్నారట. అంతేకాదు ఆయన సరసన ఏకంగా సన్నీలియోన్ (Sunny Leone) హీరోయిన్‌గా (Heroine) నటించనుందట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు కమెడియన్ ఆలీ. రీసెంట్‌గా జరిగిన F3 సక్సెస్ మీట్‌లో ఆలీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. F2 సినిమాకు సీక్వల్‌గా F3 మూవీ రాగా ఇప్పుడు దీనికి సీక్వల్‌గా F4 కూడా రాబోతోందట. ఈ సినిమాలో దిల్ రాజు ఓ హీరోగా చేయబోతున్నాడంటూ ఆలీ (Ali) కామెంట్ చేశారు. ఆయన పక్కన హీరోయిన్ సన్నీలియోన్ అంటూ వేదిక ప్రాంగణంలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు ఆలీ. అంతేకాదు ఆ అమ్మాయికి పేమెంట్ ఇచ్చేది కూడా నేనే అంటూ ఓపెన్ అయ్యారు.
F4లో దిల్ రాజు పక్కన సన్నీలియోన్ నటించడానికి తానే చొరవ తీసుకొని ఆమెను ఒప్పిస్తానని అన్నారు ఆలీ. అవును నిజమే అంటూ అంతటితో ఆగక డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా పక్కా అని మాట తీసుకున్నారు. అయితే ఇదంతా కేవలం అక్కడున్న వాళ్ళను నవ్వించేందుకు అని తెలుస్తోంది. ఆ తర్వాత దిల్ రాజు గురించి గొప్పగా చెబుతూ ఆయన టేస్ట్ ఉన్న నిర్మాత అని, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారని చెప్పారు ఆలీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక F3 సినిమా విషయానికొస్తే.. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాకు మరింత గ్లామర్ డోస్ అద్దుతూ సోహాన్ చౌహాన్, పూజా హెగ్డేలను తీసుకొచ్చారు. ఈ నెల 27వ తేదీన విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో బెస్ట్ రెస్పాన్స్ తెచ్చుకొని మంచి వసూళ్లను సాధించింది. యూఎస్ లోనూ ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్.
చిత్రంలో రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్ (Venkatesh), నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ (Varun Tej) నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా (Tamanna) నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ (Mehreen) ఆడిపాడింది. మురళీ శర్మ, ఆలీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించారు. అన్ని వర్గాల ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Dil raju, F3 Movie, Sunny Leone