DIL RAJU PARTY RAJAMOULI SHOOK HIS LEG WITH DIRECTOR ANIL RAVIPUDI FOR NAATU NAATU STEP SB
Dil Raju Party: డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి నాటు స్టెప్పులు... వీడియో చూడాల్సిందే
అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి డాన్స్
ఆర్ఆర్ఆర్ టీంకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెద్ద స్థాయిలో పార్టీ ఇచ్చారు.ఈ సెలబ్రేషన్స్‌తో ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు రాజమౌళి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
RRR సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. మల్టీస్టారర్‌తో ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే స్క్రీన్‌పై చూపించి ప్రేక్షకులతో వందకు వంద మార్కులు వేయించుకున్నారు జక్కన్న.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది. దీంతో బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన రాజమౌళి... తాజాగా 'ఆర్ఆర్ఆర్' తో దాన్ని మరో మెట్టు ఎక్కించాడు. ఇప్పటికే రూ.900 కోట్ల గ్రాస్ సాధించిన 'ఆర్ఆర్ఆర్'... రూ.1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీం పండగ చేసుకుంటున్నారు. పెద్ద స్థాయిలో పార్టీలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. పార్టీకి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా వచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు సందడి చేస్తున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి కూడా విచ్చేశారు. అలానే ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కూడా అటెండ్ అయ్యారు. పార్టీని అంతా ఎంజాయ్ చేశారు. అయితే ఈ పార్టీలో రాజమౌళి స్టెప్పులేసి అందర్నీ అలరించారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు సాంగ్స్‌కు డాన్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నైజాంలో 100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా “ఆర్ఆర్ఆర్” రికార్డును సృష్టించింది. దీంతో దిల్ రాజుకు మంచి లాభాలు రావడంతో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కి పార్టీ ఇచ్చాడు . గతంలో ‘అఖండ’ టీమ్‌కి కూడా దిల్ రాజు ఇలాగే పార్టీ ఇచ్చాడు. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ తమ తమ తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా మారకముందే పార్టీని నిర్వహించాలనుకుని దిల్ రాజు అనుకున్నాడని అందుకే పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇదివరకు అల్లు అర్జున్ 'మహానటి' టీమ్ కి ఇలానే పెద్ద పార్టీ ఇచ్చారు. ఇప్పుడు దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు టీమ్ కి పార్టీ నిర్వహించారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.