టెంపర్ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ మధ్యలో తనకు ఒక్క హిట్ కూడా రాలేదని పూరీ కూడా నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్ సినిమాపైనే ఉన్నాయి. జులై 18న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ చిత్ర కథపై ఉన్న నమ్మకంతో తానే నిర్మించి.. తెరకెక్కించాడు దర్శకుడు పూరీ. ఛార్మితో కలిసి పూరీ కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు ఈయన. ఇదిలా ఉంటే ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుంటే పూరీకి కూడా టెన్షన్ పెరిగిపోతుంది.
ఎందుకంటే నైజాంలో ఈ చిత్రాన్ని దిల్ రాజుకు ఇవ్వాలని చూస్తున్నాడు ఈయన. కానీ ఇప్పటి వరకు ఈ నిర్మాత మాత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చూడలేదని తెలుస్తుంది. గతేడాది తనయుడితో తెరకెక్కించిన మెహబూబా సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమాను అప్పట్లో దిల్ రాజు కొన్నాడు. ఈ సినిమాను చూసి బాగుందని చెప్పాడు. అయితే విడుదలైన సినిమా ఫ్లాప్ కావడంతో దిల్ రాజు జడ్జిమెంట్‌పై కూడా విమర్శలు వచ్చాయి.

పూరీ జగన్నాథ్, దిల్ రాజు
ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు దిల్ రాజు. మళ్లీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అంటే ఎలా ఉంటుందో అనే టెన్షన్ పడుతున్నాడు దిల్ రాజు. అందుకే ఎందుకైనా మంచిదని ఈ సినిమాకు ముందు నుంచే దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు చేతికి శంకర్ వస్తే సేఫ్ అవుతాడని పూరీ భావిస్తున్నా కూడా రాజు గారు మాత్రం దీనిపై అంతగా కనికరించడం లేదు. మరి చూడాలిక.. చివరికి ఇస్మార్ట్ శంకర్ పరిస్థితి ఏమవుతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:July 10, 2019, 14:41 IST