ఆ రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా తెలుగు సిని నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

news18-telugu
Updated: March 26, 2020, 8:20 PM IST
ఆ రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు
దిల్ రాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అందరికీ మద్దతుగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే త్రివిక్రమ్ రూ.20 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.75 లక్షలు, అనిల్ రావిపూడి రూ.10 లక్షలు, మహేష్ బాబు రూ.కోటి ప్రకటించగా, తాజాగా దిల్ రాజు రెండు రాష్ట్రాలకు రూ.20 లక్షలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు