Dil Raju - Pawan Kalyan - Nani : గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించడంతో పాటు బెనిఫిట్ షో వంటివి లేకుండా చేయడం వంటికి వీటికి ఆజ్యం పోసాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ .. హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వం తనపై కక్ష్య సాధించే నెపంతో మొత్తం చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా నాని కూడా ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్‌లో భాగంగా ఏపీ థియేటర్స్‌లో టికెట్స్ రేటు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరిచారనే కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయిన సంగతి తెలిసిందే కదా.
ఈ సందర్భంగా ఏపీ మంత్రులు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. ఆటోమేటిక్‌గా టిక్కెట్స్ రేట్స్ కూడా తగ్గుతాయన్నారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ విషయంలో జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో థియేటర్స్ పరిస్థితిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం మాకు అపాయింట్‌మెంట్ ఇస్తే.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులను ఏపీ మంత్రులతో పాటు సీఎంకు వివరిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే.. ఏపీలో ఓ జీవో వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏపీలో సినీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.
ఇందులో సినీ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఇకపై సినిమా వాళ్లెవరు ఈ అంశాలపై మాట్లాడొద్దు అంటూ ఇన్ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్, నాని లను హెచ్చరించారు. మరొవైపు సినిమా వార్తల విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలని అని విజ్జప్తి చేశారు.
Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవికి గత 30 యేళ్లుగా డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిర్మాతలుగా మాకు కొన్ని సమస్యలున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఐదో షోకు అనుమతులు ఇచ్చినట్టే.. ఏపీలో కూడా ఐదో ఆటకు స్పెషల్ పర్మిషన్ అడగాలనుకుంటున్నాం. ఎగ్జిబిటర్లకు కూడా కొన్ని సమస్యలున్నాయి. మా ప్రొడ్యూసర్ల సమస్యలు వేరు. వారి సమస్యలను కూడా చర్చిస్తామన్నారు. కమిటీలో నిర్మాతలతో పాటు వీరు కూడా ఉంటారు. ఇకపై జరిగిన దాని గురించి కాకుండా.. ఇకపై తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా మనందరం కలిసి ఏమి చేయాలో.. అది చేద్దామన్నారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తునే నమ్మకం ఉందన్నారు. అన్ని సమస్యలకు త్వరలో ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు దిల్ రాజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.