Home /News /movies /

అమ్మా నువ్వే గుర్తొస్తున్నావ్.. దిల్ రాజు కూతురు ఎమోషనల్ పోస్ట్..

అమ్మా నువ్వే గుర్తొస్తున్నావ్.. దిల్ రాజు కూతురు ఎమోషనల్ పోస్ట్..

అమ్మను గుర్తు చేసుకున్న దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి (dil raju daughter)

అమ్మను గుర్తు చేసుకున్న దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి (dil raju daughter)

Dil Raju Daughter: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ మొదలు పెట్టాడు. ఆయన తన రెండో భార్యతో కలిసి ప్రస్తుతం హాయిగా ఉన్నాడు.

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ మొదలు పెట్టాడు. ఆయన తన రెండో భార్యతో కలిసి ప్రస్తుతం హాయిగా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్ చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. తండ్రి రెండో భార్యతో ఉంటే ఇప్పుడు దిల్ రాజు మొదటి భార్య అనితను గుర్తు చేసింది రాజు గారి కూతురు హన్షిత. విషయం ఏంటంటే జులై 10న అనిత జయంతి. ఈ సందర్భంగా అమ్మను గుర్తు చేసుకుంది దిల్ రాజు కూతురు.
అమ్మను గుర్తు చేసుకున్న దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి (dil raju daughter)
అమ్మను గుర్తు చేసుకున్న దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి (dil raju daughter)

సోషల్ మీడియాలో ఈమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. అమ్మా నిన్ను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అంటూ హన్షితా రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. అమ్మతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంది ఈమె. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. ఇప్పటికీ నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ రాసుకొచ్చింది హన్షితా రెడ్డి. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఉన్నన్ని రోజులు ఎన్నో వేల జ్ఞాపకాలు నాకు మిగిల్చావు అంటూ ఎమోషనల్ అయింది రాజు కూతురు.

అప్పట్లో ఎక్కువగా నీతోనే కలిసి ఫోటోలు ఎక్కువగా దిగాను అంటూ చెప్పింది ఈమె. చిన్నపుడు అమ్మతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది హన్షితా రెడ్డి. తన కూతురు ఇషు రూపంలో మళ్లీ భూమ్మీదికి వచ్చావని ఆనందం వ్యక్తం చేసింది హన్షితా రెడ్డి. ప్రస్తుతం ఈ పాపకు 6 నెలలు. మొత్తానికి తండ్రి రెండో పెళ్లి చేసుకున్న సమయంలో నిన్ను ఇంకా మరిచిపోలేకపోతున్నానంటూ అమ్మను గుర్తు చేసుకుంటూ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి చేసిన పోస్ట్ మాత్రం బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dil raju, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు