విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) లు హీరోలుగా వస్తున్న సినిమా ఎఫ్3(F3). ప్రముఖ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్లో ఈ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ 3 మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం ఈ నెల 27 వ తేదీన గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఎఫ్3 ట్రైలర్లు,పోస్టర్లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోవిడ్ భయం తర్వాత థియేటర్లకు వచ్చేలా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కి సంబంధించిన ప్రత్యేక ప్రీమియర్లు ఉండవు.
ఇటీవలే విడుదలైన ఆచార్య,సర్కారు వారి పాట,కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్ (RRR) వంటి సినిమాలకు స్పెషల్ షోలు కూడా వేశారు. పలు థియేటర్లలో ఆయా సినిమాలను ముందుగానే స్పెషల్ షో వేశారు. అయితే ఎఫ్3 విషయంలో మాత్రం ప్రత్యేక ప్రీయిర్లు ఉండవని... నిర్మాతదిల్ రాజు అన్నారు. సాధారణంగా ఫ్యాన్స్ షోలు లేదా ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇస్తారు. కానీ, నిర్మాత దిల్ రాజు మాత్రం వీటన్నింటికీ వ్యతిరేకంగా వెళ్లిపోయారు. యుఎస్‌లో కూడా ఈ చిత్రానికి ముందస్తు ప్రీమియర్లు ఉండవని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఈ చిత్రం విడుదల కానుంది. డివైడ్ టాక్ వచ్చినా మేకర్స్ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అనిపిస్తోంది. ఈ ఫన్ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తమన్నా భాటియా, మెహ్రిన్,సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఇప్పటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల వరకు అయినట్లు తెలుస్తుంది. సినిమాకి మంచి టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా, సునీల్, అలీ, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరోవైపు ఎఫ్3 సినిమా టికెట్లను కూడా పెంచలేదన్నారు దిల్ రాజు. 'ఎఫ్ 3' సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్నారని అన్నారు. అందుకే 'ఎఫ్3'కి టికెట్ ధరలు పెంచలేదని తెలిపారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.