Home /News /movies /

DIL RAJU BROTHER SON ASHISH REDDY DEBUT MOVIE ROWDY BOYS MOTION POSTER RELEASED AND GETS POSITIVE RESPONSE PK

Dil Raju - Rowdy Boys: దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్ విడుదల..

దిల్ రాజు వారసుడు సినిమా రౌడీ బాయ్స్ (Rowdy Boys movie)

దిల్ రాజు వారసుడు సినిమా రౌడీ బాయ్స్ (Rowdy Boys movie)

Dil Raju - Rowdy Boys: దిల్ రాజు (Dil Raju - Rowdy Boys) ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఈయన నిర్మాణం వచ్చిన సినిమాలు ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాయి. ఇప్పుడు తన ఇంటి నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. ఈయన తన తమ్ముడి కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
దిల్ రాజు ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఈయన నిర్మాణం వచ్చిన సినిమాలు ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాయి. ఇప్పుడు తన ఇంటి నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. ఈయన తన తమ్ముడి కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నాడు. ఆ సినిమా పేరు రౌడీ బాయ్స్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుంది. ఆ మధ్య వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా ప్రమోషన్ చాలా బాగా చేసారు. అయితే కరోనా కారణంగా సినిమా మళ్లీ వాయిదా పడింది. చిన్న సినిమానే అయినా కూడా పెద్ద ప్రమోషన్ చేస్తున్నాడు ఈయన. దానికి కారణం ఆ సినిమాలో ఉన్నది ఆయన వారసుడు కావడం. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం వార‌సుల‌తో నిండిపోయింది. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 80 శాతం వార‌సులే ఉన్నారిక్క‌డ‌. మెగా కుటుంబం నుంచి అయితే ఏకంగా క్రికెట్ టీం వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్నాడు. ఆయ‌న సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు ఈ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అనే టైటిల్ ఖరారు చేసారు.

ఆ మధ్య వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రతీ యాడ్‌కు మధ్యలో రౌడీ బాయ్స్ ప్రోమో సాంగ్ వచ్చింది. అప్పుడే సినిమా పేరు అందరికీ బాగా రిజిష్టర్ అయిపోయింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సందడి లేకుండా వారసుడి సినిమాను పూర్తి చేస్తున్నాడు దిల్ రాజు. హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2019 దసరా సందర్భంగా చిత్ర ఓపెనింగ్ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పుడే మొదలుపెట్టారు.

అయితే మధ్యలో కొన్ని కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. 2021 అక్టోబర్‌లో సినిమా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణం నుంచే ఈ చిత్రం వస్తుంది. ఈ చిత్రంతో త‌న వార‌సున్ని నిల‌బెట్టాల‌ని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైందిప్పుడు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి చూడాలిక.. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఎంతవరకు నిలబడతాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dil raju, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు