Home /News /movies /

DIL RAJU BROTHER SHIRISH REDDY SON ASHISH REDDY ALL SET TO DEBUT IN TOLLYWOOD WITH NEW AGE DRAMA PK

Dil Raju - Ashish Reddy: దిల్ రాజు వారసుడు వచ్చేస్తున్నాడు.. స్నేహితుడి నిర్మాణంలో..

దిల్ రాజు Photo : Twitter

దిల్ రాజు Photo : Twitter

Dil Raju - Ashish Reddy: ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం వార‌సుల‌తో నిండిపోయింది. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 80 శాతం వార‌సులే ఉన్నారిక్క‌డ‌. మెగా కుటుంబం నుంచి అయితే ఏకంగా క్రికెట్ టీం వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు.

ఇంకా చదవండి ...
ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం వార‌సుల‌తో నిండిపోయింది. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 80 శాతం వార‌సులే ఉన్నారిక్క‌డ‌. మెగా కుటుంబం నుంచి అయితే ఏకంగా క్రికెట్ టీం వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం నిర్మాత కుటుంబం నుంచి వ‌స్తున్నాడు వార‌సుడు. తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ నిర్మాతగా ఉన్న‌ దిల్ రాజు ఇప్పుడు త‌న వార‌సున్ని ఇండ‌స్ట్రీకి తీసుకొస్తున్నాడు. ఆయ‌న సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు ఈ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సందడి లేకుండా వారసుడి సినిమాను పూర్తి చేస్తున్నాడు దిల్ రాజు. అయితే నిర్మాత మాత్రం తాను కాదు.. తన స్నేహితుడు, నిర్మాణ భాగస్వామి అయిన బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ లాక్ చేసింది కూడా దిల్ రాజే. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా పలుకే బంగారమాయె అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2019 దసరా సందర్భంగా చిత్ర ఓపెనింగ్ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అప్పుడే మొదలుపెట్టారు. అయితే మధ్యలో కొన్ని కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. 2021 సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.
Dil Raju Introducing his Brothers son Ashish Reddy.. One more hero coming to tollywood kp.. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం వార‌సుల‌తో నిండిపోయింది. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 80 శాతం వార‌సులే ఉన్నారిక్క‌డ‌. మెగా కుటుంబం నుంచి అయితే ఏకంగా క్రికెట్ టీం వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం నిర్మాత కుటుంబం నుంచి వ‌స్తున్నాడు వార‌సుడు. dil raju,dil raju telugu cinema,dil raju brother son movie,dil raju varasudu entry,asish reddy movie entry,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు తనయుడు,దిల్ రాజు ఎంట్రీ,తెలుగు సినిమా,ఆశీష్ రెడ్డి దిల్ రాజు
దిల్ రాజు


దిల్ రాజు నిర్మాణం నుంచి సినిమా వ‌చ్చిందంటే క‌చ్చితంగా కాసులు కురిపించ‌డం ఖాయం. దాంతో ఇప్పుడు మ‌రోసారి త‌న కుటుంబం నుంచి వ‌స్తున్న వార‌సుడి కోసం కూడా సమ్మర్‌నే టార్గెట్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ చిత్రంతో త‌న వార‌సున్ని నిల‌బెట్టాల‌ని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు మరో నాలుగు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. మరోవైపు వారసుడి ఎంట్రీ పనులు చూసుకుంటున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఆశీష్ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dil raju, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు