Naga Shaurya : దిగు దిగు దిగు నాగ.. వరుడు కావలెను నుంచి కొత్తసాంగ్... తెలంగాణ జానపదానికి ఫిదా...

Varudu Kaavalenu Poster Photo : Twitter

Naga Shaurya : యువ హీరో నాగశౌర్య హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.

  • Share this:
    యువ హీరో నాగశౌర్య హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసింది. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని చేస్తున్నారు. త్వరలో విడుదలకానుంది.

    ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు.


    ఇది కూడా చూడండి Flora Saini : పలుచని చీరలో లక్స్ పాప పరువాల విందు… వారెవ్వా అనాల్సిందే..

    ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: