Home /News /movies /

DIGITAL SCREEN COLLAPSED IN VIRATA PARVAM MOVIE TEASER LAUNCH EVENT SB

Virata Parvam: విరాట పర్వం ఈవెంట్‌లో అపశృతి.. కూలిన వేదిక

తెలంగాణ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ’విరాట పర్వం’ (Viraataparvam Photo : Twitter)

తెలంగాణ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ’విరాట పర్వం’ (Viraataparvam Photo : Twitter)

కర్నూలులో విరాట పర్వం టీజర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

    దగ్గుబాటి రానా(Rana), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా విరాటపర్వం(Virata parvam). వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ (June) 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రానా, ప్రియమణి (Priyamani)నక్సలైట్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ .. స్పెషల్ వీడియోస్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ లో నట విశ్వరూపంచూపించారు రానా, సాయి పల్లవి.

    అయితే విరాట పర్వం మూవీ టీజర్ లాంచింగ్‌ కర్నూలులో(Kurnool) జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం ఈ ఈవెంట్ జరుగుతుండగా గాలి దుమారం చెలరేగింది. బలమైన ఈదురుగాలులకు వేదికతో పాటు డిజిటల్ స్క్రీన్ కూలిపోయింది. దీంతో నిర్వాహకులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రానా, సాయిపల్లవి వేదికపైకి రాకముందే ఈ ఘటన జరగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

    విరాట పర్వం(Virata Parvam) డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. హీరో రానా ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి విశ్వరూపం చూస్తారని సాయి పల్లవి గురించి ఓ రేంజ్ లో చెప్పారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాళ్ళు చెప్పింది కరక్టే అనిపిస్తుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని కలవడానికి ఇల్లు వదిలి వెళ్తుంది. నక్సలైట్ లతో సంబంధాలు ఉన్నాయని ఆమెని పోలీసులు చిత్ర హింసలు పెడతారు. చివరికి రానాకి తన ప్రేమ అర్థమయ్యేలా చెప్పి సాయి పల్లవి కూడా నక్సలైట్ గా మారుతుంది.

    విరాట పర్వం కథ మొత్తం సాయి పల్లవి కోణంలోంచి ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పుట్టినప్పుడు అమ్మ కడుపులోనుంచే లాంటి అద్భఉతమైన డైలాగ్స్ పేలాయి ట్రైలర్ లో వీటితో పాటు ప్రేమ గురించి, యుద్ధం గురించి చాలా డైలాగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ట్రైలర్ లోనే సాయిపల్లవి నట విశ్వరూపం చూపించింది. రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కూడా నక్సలైట్స్ గా అదరగొట్టారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు విరాటపర్వంపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rana, Rana daggupati, Sai Pallavi, Virata Paravam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు