Netflix - Baahubali: ‘బాహుబలి’ సిరీస్‌తో తెలుగు దర్శకులకు నెట్‌ఫ్లిక్స్ ఘోర అవమానం.. అసలేం జరిగింది..?

Digital house Netflix scraps Baahubali series and re shoot again

Netflix - Baahubali: బాహుబలి సెన్సేషనల్ హిట్‌ తర్వాత అందులో పాత్రల గొప్పతనాన్ని చాటేలా ప్రముఖ డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేసింది. అయితే ఇప్పటి వరకు మన తెలుగు దర్శకులు డైరెక్ట్‌ చేసిన ఈ వెబ్‌సిరీస్‌ను పక్కన పెట్టేసి ఇతర దర్శకులతో మళ్లీ రీ షూట్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  ‘బాహబలి-01,02 సినిమాలు ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలుగా నిలిచి.. టాలీవుడ్ కీర్తి, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన విషయం విదితమే. ఈ సినిమాలు రిలీజ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్‌ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా భారీ సక్సెస్ తర్వాతే టాలీవుడ్ సినిమాలకు వాల్యూ పెరిగింది.. అంతేకాదు.. పాన్ ఇండియా సినిమాకు అసలు సిసలైన అర్థాన్ని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చూపించారు. అయితే.. ఆ సినిమా 1,2 పార్ట్‌లతోనే ఆగిపోకూడదని పార్ట్-03 కి కూడా తెరకెక్కించాలని నెట్ ఫ్లిక్స్‌తో కలిసి జక్కన్న ప్లాన్ చేశారు. అందుకు జక్కన్న ప్రముఖ రైటర్స్‌తో కలిసి రాజమౌళి కథ రెడీ చేయించారు. దీనికి ‘బిఫోర్ ద బిగినింగ్’ టైటిల్ అనుకున్నారు.

  ఇదీ అసలు విషయం!
  తెలుగు దర్శకులైన.. టాలీవుడ్‌లో తమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు ఈ బాధ్యతలను జక్కన్న అప్పగించారు. ఆనంద్ నీలకంఠ రాసిన కథ ఆధారంగా ‘ద రైజ్ ఆఫ్ శివగామి’, ‘చతురంగా’, ‘ద క్వీన్ ఆఫ్ మాహిష్మతి’ అధ్యయలను సినిమాలో చూపించడానికి కసరత్తులు చేసి రంగంలోకి దిగారు. ఊహించిన దానికంటే భారీగానే షూట్ చేశారు. కానీ ఫైనల్‌ కట్ చూసుకున్న తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యానికి అస్సలు నచ్చలేదట. ‘అసలేంటిది.. ఇంత చెత్తగానా..? దీన్ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేయండి.. మీ వల్ల వంద కోట్ల నాశనమయ్యాయ్’ అని నెట్‌ఫ్లిక్స్ తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ నెట్‌ఫ్లిక్స్‌ విషయమై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ షూటింగ్‌కు ఎంత ఖర్చు చేశారన్న దానిపై ప్రముఖ వెబ్‌సైట్లు కొన్ని వంద కోట్లు అని.. ఇంకొన్ని రెండొందల కోట్లు అని రాస్తున్నాయ్.

  ఎందుకింత ఓవరాక్షన్!
  అయితే.. ఇక ఈ తెలుగు దర్శకులొద్దు బాబోయ్ అనుకున్న నెట్‌ఫ్లిక్స్‌ మళ్లీ 150 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో మళ్లీ మొదట్నుంచి వేరే డైరెక్టర్లతో పని కానిచ్చేయాలని యాజమాన్యం భావిస్తోందట. త్వరలోనే రీ షూట్‌కు పనులన్నీ చక్కదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌పై వ్యవహారంపై ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తునే చర్చే జరుగుతోంది. కొందరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎక్కడ తమరికి నచ్చలేదో చూపించి మళ్లీ పనిచేయించుకోకుండా ఎందుకింత ఓవరాక్షన్ అంటూ..? అని నెట్‌ఫ్లిక్స్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

  ఎందుకు మౌనం!
  ఇదిలా ఉంటే.. ఇక వీళ్లంతా కుదరదులే కానీ డైరెక్ట్‌గా రాజమౌళినే రంగంలోకి దింపాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోందట. త్వరలోనే ఆయన్ను సంప్రదించాలని భావిస్తున్నారట. అయితే.. జక్కన్న ఏమంటారో..? గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వ్యవహారంపై అటు నెట్‌ఫ్లిక్స్‌ కానీ.. ఇటు ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలుగానీ రియాక్ట్ అయితే తప్ప అసలు విషయం తెలిసొచ్చే పరిస్థితులు లేవు. ఇంత జరుగుతున్నా కనీసం నిజానిజాలేంటో చెప్పడానికి మన దర్శకులు ఎందుకు సంకోచిస్తున్నారో.. మౌనానికి అర్థం అంగీకారమో ఏంటో మరి.
  Published by:Anil
  First published: