Home /News /movies /

DIFFERANT STORY MOVIE GEETHA SAKSHIGA TEASER RELEASED SLB

Geetha Sakshiga: గీతా సాక్షిగా టీజర్.. ఆకట్టుకుంటున్న విజువల్స్

Geetha sakshiga News 18

Geetha sakshiga News 18

Geetha Sakshiga Teaser: నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కొత్త చిత్రం గీతా సాక్షిగా. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
పుష్పక్, JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్ (Aadarsh), చిత్ర శుక్లా (Chitra Shukla), రూపేష్ శెట్టి (Rupesh shetty), శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Ayyangar), భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గీతా సాక్షిగా (Geetha Sakshiga). నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు సినిమాపై మరింత హైప్ వచ్చేలా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటోంది. చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ చూస్తుంటే.. ఈ మూవీ కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా మరియు రాజా రవీంద్ర, లాయర్‌ శ్రీకాంత్ అయ్యంగార్‌, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ తో తను చేసే ఫైట్ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తో అద్భుతమైన విజువల్స్ జోడించి ఈ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో.. కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్‌తో, BGMతో అందరినీ అలరిస్తుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు వెంకట్ హ‌నుమ నరిసేటి సినిమాటోగ్ర‌ఫీగా, కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్ర ఆడియోను ఆదిత్య మ్యూజిక్ అందిస్తోంది. పృధ్వీ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. అతి త్వరలో చిత్ర రిలీజ్ డేట్ తో పాటు మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.
Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు