• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DID YOU PEOPLE ANY GUESS ABOUT NAGA BABU WHATSAPP DP TRUST ME YOU DONT EVEN AN IDEA PK

Naga Babu: నాగబాబు వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా.. మీ ఊహకు కూడా అందదు..!

Naga Babu: నాగబాబు వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా.. మీ ఊహకు కూడా అందదు..!

నాగబాబు న్యూ లుక్ (Naga Babu new look)

Naga Babu: ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు ఈయన. ఎవర్ని కావాలంటే వాళ్లను.. అప్పటికప్పుడు టార్గెట్ చేయడంలో నాగబాబు(Naga Babu) దిట్ట. గతంలోనూ కొందర్ని లక్ష్యంగా చేసుకుని ఈయన వేసిన సెటైర్లు బాగా పాపులర్ అయ్యాయి.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలు, సోషల్ మీడియాతో ఎక్కువగా బిజీగా ఉండే నటుడు నాగబాబు. ఈయన సినిమాలు చేసేది తక్కువ.. బయట చేసే అల్లరి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు ఈయన. ఎవర్ని కావాలంటే వాళ్లను.. అప్పటికప్పుడు టార్గెట్ చేయడంలో నాగబాబు దిట్ట. గతంలోనూ కొందర్ని లక్ష్యంగా చేసుకుని ఈయన వేసిన సెటైర్లు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని చెప్పడం.. వర్మను పిచ్చికాకి అనడం లాంటివి బాగా కాంట్రవర్సీ అయ్యాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా ఈయన అభిమానులతో ఛాటింగ్ చేసాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు కాదనకుండా సమాధానం చెప్పాడు. అందులో భాగంగానే ఓ నెటిజన్ మీ వాట్సాప్ డిపీ ఏంటి సర్ అని అడిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ చూపించండి అంటూ అడిగాడు. దానికి నాగబాబు కూడా ఓకే అనేసి తన వాట్సాప్ డీపికి సంబంధించిన ఫోటోను షేర్ చేసాడు. ఇది చూసిన తర్వాత ఆ అడిగిన నెటిజన్‌కు కూడా హార్ట్ ఎటాక్ వచ్చుంటుంది.

ఎందుకంటే ఈయన చూపించిన ఫోటో అలా ఉంది మరి. అంతగా భయపెట్టే ఫోటో ఏం చూపించాడబ్బా అనుకుంటున్నారా..? నాగబాబు తన వాట్సాప్ డీపీ ఫోటోగా బాలయ్య, వర్మ కలిసున్న ఫోటోను చూపించాడు. అప్పట్లో సర్కార్ 3 సెట్‌లో వర్మను బాలయ్య కలిసాడు.
Naga Babu,Naga Babu twitter,Naga Babu facebook,Naga Babu whatsapp dp,Naga Babu whatsapp dp balakrishna ram gopal varma,naga babu balakrishna,telugu cinema,నాగబాబు,నాగబాబు బాలకృష్ణ,నాగబాబు వాట్సాప్ డీపీ బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ
నాగబాబు వాట్సాప్ డీపీ (Naga Babu Whatsapp DP)

అదే ఫోటోను ఇప్పుడు షేర్ చేసాడు నాగబాబు. నిజంగానే ఈయన తన ఫోన్‌లో వాట్సాప్ డీపీ ఇది పెట్టుకున్నాడా లేదంటే అలా సెటైర్ వేసాడా అనేది సస్పెన్స్. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం కావాలనే మళ్లీ కెలుకుతున్నాడంటూ నాగబాబుపై మండి పడుతున్నారు. ఏదేమైనా కూడా నాగబాబు వాట్సాప్ డీపీ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు