Alia Bhatt- RRR: అలియా భట్ పోస్టర్‌లో దీన్ని గ‌మ‌నించారా.. అప్పుడు 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ పోస్ట‌ర్‌లోనూ

‘సీత’గా ఆలియా భట్ లుక్ విడుదల (Twitter/Photo)

Alia Bhatt- Ram Charan: ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ ఈ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపిస్తుండ‌గా.. అత‌డి స‌ర‌స‌న సీత‌గా ఆలియా క‌నిపించ‌నుంది.

  • Share this:
    Alia Bhatt- Ram Charan: ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ ఈ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపిస్తుండ‌గా.. అత‌డి స‌ర‌స‌న సీత‌గా ఆలియా క‌నిపించ‌నుంది. ఇక సోమ‌వారం ఆలియా భ‌ట్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఆలియా భ‌ట్ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు. అందులో ఆలియా లుక్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. కాగా ఈ పోస్ట‌ర్‌లో ఒక విష‌యాన్ని గ‌మ‌నించారా.. పోస్ట‌ర్‌లో ఆలియా భ‌ట్ ఒక లాకెట్‌ని వేసుకొని ఉంటుంది. అయితే అదే లాకెట్‌ని రామ్ చ‌ర‌ణ్ కూడా ధ‌రించి ఉంటాడు. ఆ మ‌ధ్య ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ అంటూ రాజ‌మౌళి చెర్రీ, ఎన్టీఆర్ చేతులు ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో చెర్రీ చేతికి అదే లాకెట్‌ ఉంటుంది.

    మామూలుగా అల్లూరి సీతారామ‌రాజు చరిత్ర ప్ర‌కారం.. రామ‌రాజును, సీత ఇష్ట‌ప‌డుతుంద‌ట‌. అయితే స్వాతంత్ర్య ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హరించే బాధ్యతలు తీసుకున్న రామ‌రాజు ఆమెను వివాహం చేసుకునేందుకు విముఖ‌త చూపుతాడట‌. దీంతో సీత‌ మ‌ర‌ణించ‌గా.. ఆమెకు గుర్తుగా త‌న పేరును సీతారామ‌రాజుగా మార్చుకున్న‌ట్లుగా చరిత్ర చెబుతుంది. ఇక సినిమాలో కూడా ఇలానే చూప‌నున్నార‌ని, అంటే ఆలియా భ‌ట్ మ‌ర‌ణం త‌రువాత ఆమె మెడ‌లో ఉన్న లాకెట్‌ని రామ్ చ‌ర‌ణ్ చేతికి చుట్టుకుంటాడ‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో రాజ‌మౌళి వీరిద్ద‌రి పాత్ర‌ల‌ను ఎలా చూప‌నున్నారో.



    కాగా భారీ బ‌డ్జెట్‌లో ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న ఒలివియా న‌టిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్, స‌ముద్ర ఖ‌ని, శ్రియ‌, రాహుల్ రామ‌కృష్ణ, రాజీవ్ క‌న‌కాల‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ మూవీపై అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published: