DID YOU KNOW THE REAL NAME OF JABARDASTH STAR COMEDIAN SUDIGALI SUDHEER AND HERE THE STORY PK
Sudigali Sudheer real name: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అసలు పేరు ఎంతమందికి తెలుసు..?
సుడిగాలి సుధీర్ (sudigali sudheer)
Sudigali Sudheer real name: ఈ జబర్దస్త్ కమెడియన్ అసలు పేరు సుధీర్ (Sudigali Sudheer real name) కాదు. చాలా మందికి సుధీర్ అనేది మాత్రమే తెలుసు కానీ అసలు ఈయన అసలు పేరు ఏంటనేది కేవలం సన్నిహితులకు మాత్రమే తెలుసు. నిజానికి జబర్దస్త్ సెట్లో కూడా చాలా మందికి సుధీర్ అసలు పేరు తెలియదు.
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనోడికి బుల్లితెరపై మెగా ఇమేజ్ ఉంది. సంపాదనలో కూడా హీరోలతో పోటీ పడుతున్నాడు. నెలకు లక్షల్లో.. ఏడాదికి కోట్లల్లోకి చేరిపోయింది సుధీర్ సంపాదన. జబర్దస్త్‌కు ముందు చిన్న చిన్న మ్యాజిక్కులు చేసుకునే సుధీర్.. ఆ తర్వాత మెల్లగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన రేంజ్ ఏంటో కళ్ల ముందే కనిపిస్తుంది. ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీ అయితే పూర్తిగా సుధీర్ మీదే ఆధారపడిందేమో అనేంతగా ఆయనతోనే ఈవెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సుధీర్ తప్ప మరొకరు కనిపించడం లేదు. సుడిగాలి సుధీర్ అనేది ఇప్పుడు బుల్లితెరపై బ్రాండ్ అయిపోయింది. అలాంటి ఈ కమెడియన్ అసలు పేరు సుధీర్ కాదు. చాలా మందికి సుధీర్ అనేది మాత్రమే తెలుసు కానీ అసలు ఈయన అసలు పేరు ఏంటనేది కేవలం సన్నిహితులకు మాత్రమే తెలుసు. నిజానికి జబర్దస్త్ సెట్లో కూడా చాలా మందికి సుధీర్ అసలు పేరు తెలియదు. అంతా సుడిగాలి సుధీర్ అని మాత్రమే పిలుస్తుంటారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ పేరు పాపులర్ అయింది.
దానికి ముందు సుధీర్ పేరు అది కాదు.. ఇంట్లో కూడా ఈయన్ని సుధీర్ అని పిలవరు. మరి ఈ సుడిగాలి కమెడియన్ అసలు పేరేంటో తెలుసా.. సిద్ధూ. అవును.. ఓన్లీ సిద్ధూ. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్‌గా చెప్తాడు కదా.. నా పేరు సిద్ధూ అని. అలా సుధీర్ పేరు కూడా సిద్ధు. ఇంట్లో ఈయన్ని అలాగే పిలుస్తుంటారు. కేవలం బయట మాత్రమే సుధీర్ అని పిలుస్తుంటారు. ఈ మధ్యే ఓ ఈవెంట్‌కు సుధీర్ అక్క కెనడా నుంచి వచ్చింది. స్టేజీపై అందరూ చూస్తుండగానే సిద్ధూ అని పిలిచింది.
దాంతో అక్కడున్న వాళ్ళతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.. అక్కడ సిద్ధూ ఎవరబ్బా అని..! ఆ తర్వాత సుధీర్ అక్క అసలు విషయం చెప్పింది. తన తమ్ముడు పేరు సుధీర్ కాదని.. సిద్ధూ అనే అంతా పిలుస్తుంటామని. కానీ ఇండస్ట్రీలో మాత్రం సుధీర్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈయన షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు చేసిన సుధీర్.. తాజాగా కాలింగ్ సహస్ర సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రష్మి గౌతమ్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు సుధీర్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.