Home /News /movies /

Alia Bhatt: వామ్మో.. ఇక్కడ ఉన్నది ఆర్ఆర్ఆర్ హీరోయినా.. ఇలా ఉందేంటి?

Alia Bhatt: వామ్మో.. ఇక్కడ ఉన్నది ఆర్ఆర్ఆర్ హీరోయినా.. ఇలా ఉందేంటి?

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత మహేష్ భట్ మనవరాలే అలియా భట్.

    Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత మహేష్ భట్ మనవరాలే అలియా భట్. ఎప్పటి నుంచో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంచేత అలియా కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో కూడా అలియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా, ముద్దుగా ఉండే అలియా సినిమాలలోకి రాకముందు ఎంతో లావుగా బొద్దుగా ఉండేది. అయితే ఈమె మొట్టమొదటిసారిగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమాలో సెలెక్ట్ అయ్యారు.అయితే అధిక శరీర బరువు ఉండటం కారణంగా ఈమె ఈ సినిమాలో నటించడానికి పూర్తిగా శరీర బరువు తగ్గాలనీ చిత్రబృందం చెప్పడంతో ఈమె ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఏకంగా 16 కిలోల బరువు తగ్గిందనీ తెలియజేశారు.

    ప్రస్తుతం అలియా శరీర వ్యాయామాలు చేస్తున్నటువంటి వీడియో వైరల్ గా మారడమే కాకుండా ఆమె ఏకంగా 16 కిలోల బరువు తగ్గడం కోసం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకునేదనే విషయం కూడా బయటకు వచ్చింది. మరి ఈ హీరోయిన్ సన్నబడటం కోసం ఎలాంటి ఆహారం తీసుకునేది అనే విషయానికి వస్తే..



    అలాగే ప్రతిరోజు ఉదయం కార్న్ ఫ్లెక్స్, ఒక ఉడికించిన గుడ్డు, శాండ్విచ్, షుగర్ లేకుండా టీ ,కాఫీ మాత్రమే తీసుకునేది. అలాగే మిడ్ మార్నింగ్ కూరగాయల జ్యూస్, ఇడ్లీ సాంబార్, ఫ్రూట్స్ తీసుకునేవారు. ఇక మధ్యాహ్న భోజనానికి వస్తే పప్పు, రోటి ఆయిల్ లేకుండా తీసుకునేవారు. మిడ్ ఈవెనింగ్ పండ్లు, టీ, కాఫీ (చక్కెర లేకుండా) తీసుకునేవారు. ఇక డిన్నర్ విషయానికి వస్తే రోటీ,కూరగాయలు ఒక కప్పు రైస్ పప్పు చికెన్ బ్రెస్ట్ ఆయిల్ లేకుండా తీసుకునే వారని ఆలియా ఫుడ్ చార్ట్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt weight loss journey, Bollywood, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు