HOME »NEWS »MOVIE »did trisha krishnan walks out of megastar chiranjeevi and koratala shiva ba

చిరంజీవి, కొరటాల శివ సినిమా నుంచి త్రిష ఔట్?

చిరంజీవి, కొరటాల శివ సినిమా నుంచి త్రిష ఔట్?
చిరంజీవి, త్రిష (Chiranjeevi Trisha)

Trisha Krishnan | చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి త్రిష తప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా త్రిష తప్పుకొన్నట్టు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ సినిమాలో చిరంజీవి, త్రిష్ కలసి పనిచేశారు. అయితే, మరోసారి ఇప్పుడు వారిద్దరూ వెండితెరమీద కనిపించనున్నారని అంతా భావించారు. చిరంజీవి సరసన హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, దానికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవితోపాటు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా కీ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మహేష్ బాబుకు కూడా ఓ హీరోయిన్ ఉండే చాన్స్ ఉంది. ఆ లెక్కన మహేష్ బాబు పక్కన మరో యంగ్ హీరోయిన్‌ను తీసుకుని, తాను చిరంజీవి పక్కన నటిస్తే మరీ ఆంటీ అనుకుంటారనే అభిప్రాయంతో త్రిష తప్పుకొందంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:March 13, 2020, 18:55 IST