ఖాతాలో రెండు హిట్లు... బాలయ్యకు నో చెప్పిన హీరోయిన్?

బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా ఓ గ్రేట్ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో హీరోయిన్లు మంచి క్యారెక్టర్ ఎప్పుడూ క్రియేట్ చేస్తూ ఉంటాడు.

news18-telugu
Updated: January 4, 2020, 4:17 PM IST
ఖాతాలో రెండు హిట్లు... బాలయ్యకు నో చెప్పిన హీరోయిన్?
బాలయ్య ఫైల్ ఫోటో
  • Share this:
నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి హీరోయిన్ తమన్నా నో చెప్పినట్టు తెలిసింది. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్‌గా తీసుకోవడానికి ఆమెను సంప్రదించారు. అయితే, ఆ సినిమాకు తమన్నా నో చెప్పినట్టు సమాచారం. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వల్లే తమన్నా బాలయ్య సినిమా చేయలేకపోతున్నట్టు చెప్పిందని సినిమా యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా ఓ గ్రేట్ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో హీరోయిన్లు మంచి క్యారెక్టర్ ఎప్పుడూ క్రియేట్ చేస్తూ ఉంటాడు. గతంలో సింహా సినిమాలో నయతనార అందుకు ఉదాహరణ. బోయపాటి గతంలో కియారా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్లుగా సినిమాలు చేశాడు. అటు తమన్నా కూడా 2019 సంవత్సరంలో రెండు హిట్లు అందుకుంది. చింరజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా క్యారెక్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ సరసన నటించి గ్లామర్‌గా కూడా కనిపించింది. అటు అందం, ఇటు అభినయంతో ఇద్దరు సీనియర్ హీరోల పక్కన నటించి ఆకట్టుకున్న తమన్నా మరో సీనియర్ హీరో బాలయ్యతో సినిమాకు నో చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు