సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ఆయన తండ్రి సీబీఐ ఎంక్వైరీ కోరారా.. అసలు నిజం ఇదే..

బాలీవుడ్‌లో ఇపుడిపుడే  నటుడిగా పైకి వస్తోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ వర్గాలను నిర్ఘాంత పోయేలా చేసింది. సుశాంత్ మరణంపై ఆయన తండ్రి నిజంగానే ట్విట్టర్ వేదికగా సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసారా.. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 8, 2020, 9:34 PM IST
సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ఆయన తండ్రి సీబీఐ ఎంక్వైరీ కోరారా.. అసలు నిజం ఇదే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్‌లో ఇపుడిపుడే  నటుడిగా పైకి వస్తోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ వర్గాలను నిర్ఘాంత పోయేలా చేసింది. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజమ్‌తో పాటు బయటి వాళ్లను ఎదగనీయకుండా ఎంత స్థాయిలో తొక్కేస్తున్నారనేది మరోసారి అర్థమైపోయింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ముంబై పోలీసులు తమ విచారణను వేగవంతం చేసారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో పాటు ఇంటి పని మనుషులతో పాటు ఆయనతో సంబంధం ఉన్న వాళ్లను పోలీసులు తమదైన కోణంలో ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆయ  రియా చక్రబర్తితో పాటు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ  కేసు విషయమై 29 మంది పైగా విచారించారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో  ఈ సందర్భంగా సుశాంత్ తండ్రితో పాటు..   బీహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పప్పు యాదన్..  సుశాంత్ సింగ్ ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన మృతిపై అనుమానులున్నాయి. కేంద్రం ఆయన మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

Did Sushant Singh Rajputs father tweet about CBI inquiry ? on his suicide,sushant singh rajput,Sushant Singh Rajput suicide,Sushant Singh Rajput dil bechara,dil bechara movie,Sushant Singh Rajput father probe cbi enquiry,Sushant Singh Rajput father kk singh,sushant singh rajput cbi enquiry,sushant singh rajput cbi,sushant singh rajput postmortem complete,sushant singh rajput postmortem,sushant singh rajput,sushant singh rajput death,sushant singh rajput rare photos,sushant singh rajput unseen photos,sushant singh rajput twitter,sushant singh rajput dies,sushant singh rajput hero death,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రేర్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్‌సీన్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్ కంప్లీట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ ఎంక్వైరి,సీబీఐ ఎంక్వైరి,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్,సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై తండ్రి కేకే సింగ్ సీబీఐ ఎంక్వైరీ కోరారా,దిల్ బేచారా మూవీ,దిల్ బేచారా మూవీ
సుశాంత్ తండ్రి చేసినట్టుగా చెబుతున్న ఫేక్ ట్విీట్ (Twitter/Photo)


ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పేరిట ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా చేసారు. ఐతే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రికి ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆయన పేరు మీద ఎవరో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి సీబీఐ ఎంక్వైరి చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఆ తర్వాత ట్విట్టర్‌లో ఆ పోస్ట్‌లను డిలీట్ చేసారు.  జూన్ 14న సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత అతని కుటుంబ సభ్యులు మీడియాతో కానీ.. ఎవరితో కానీ సీబీఐ ఎంక్వైరీ గురించి వ్యాఖ్యానించలేదని చెబుతున్నారు. కానీ సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. ఈ మధ్య శేఖర్ సుమన్.. సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని ట్వీట్ చేసినా... ఆయనకు సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ సుశాంత్ సింగ్ ఫ్యామిలీతో పాటు అభిమానులు మాత్రం ఆయన మృతి  వెనక ఉన్న నిజాలను వెలికి తీయాలని కోరుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ మాత్రం సుశాంత్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి పెట్టింది. ఇక సుశాంత్ చివరగా నటించిన ‘దిల్ బేచారా’ చిత్రం ఈ నెల 24న డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 8, 2020, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading