• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • DID SAI PALLAVI NOT MATCH PRABHAS HEIGHT FOR THE ROLE OF SALAAR HEROINE MHN

Salaar - Sai Pallavi: ప్రభాస్ ఎత్తుకు సాయిపల్లవి సరిపోదా? సలార్ హీరోయిన్ పై కొత్త చర్చ

Salaar - Sai Pallavi: ప్రభాస్ ఎత్తుకు సాయిపల్లవి సరిపోదా? సలార్ హీరోయిన్ పై కొత్త చర్చ

salaar, prabhas, sai pallavi sai pallavi and prabhas, sai pallavi in salaar, prasanth neel, prashanth neel salaar, tollywood, telugu movies, సాయిపల్లవి, ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్

Salaar - Sai Pallavi: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సలార్‌' ఇందులో సాయిపల్లవి నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  మిర్చి సినిమాలో ప్ర‌భాస్‌ని చూసి అనుష్క ఓ మాట అంటుంది. ఆ మాట ప్ర‌భాస్‌పెళ్లిచేసుకోబోయే అమ్మాయి హైట్ గురించి. `నువ్వు మ‌రీ ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉండి... అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఏం బావుంటుంది... క‌నీసం ఈడూజోడూ ఉండాలి క‌దా` అని! అనుష్క ఆ మాట అనీ అన‌గానే సాయిప‌ల్ల‌వి కూడా కౌంట‌ర్ ఇచ్చేసింది. సినిమా, సంద‌ర్భం వేర‌నుకోండీ! అదే... ఫిదా క్లైమాక్స్ లో... ముద్దు పెట్టుకోవ‌డానికి వ‌రుణ్‌తేజ్‌ని ఎత్తుకోమ‌ని అడుగుతుంది క‌దా!. ఇప్పుడు అనుష్క‌, సాయిప‌ల్ల‌వి, వాళ్ల డైలాగులూ బావున్నాయి. కానీ అస‌లు టెన్ష‌న్ మాత్రం ప్ర‌భాస్‌కే.

  మిర్చి సినిమాలో డైలాగు లాగా త‌న హైట్‌కి త‌గ్గ పెయిర్‌ని చూసుకోవాలా? లేకుంటే ఫిదాలో వ‌రుణ్‌తేజ్ చేసిన ప‌ని చేసేయొచ్చులే అని హైట్ కాస్త త‌క్కువ‌గా ఉన్న సాయిప‌ల్ల‌వికి ఓటేయాలా? ప్ర‌భాస్ ఈ డైల‌మాలో ఉంటే ప్ర‌శాంత్ నీల్ మాత్రం ఫిదా లేటెస్ట్ వెర్ష‌న్ డార్లింగ్‌. ఈ డైలాగ్‌నే ఫాలో అవుదాం అని హింట్ ఇస్తున్నార‌ట‌. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ మూవీ స‌లార్‌లో సాయిప‌ల్ల‌వి ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్నార‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌. ఇది న్యూసే అయినా, గెస్సింగే అయినా క‌న్విన్సింగ్‌గానే ఉందంటున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. సాయిప‌ల్ల‌వికి కేర‌ళ‌, త‌మిళ‌నాడులో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు గురించి స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేయ‌క్క‌ర్లేదు. క‌న్న‌డీగులు కూడా ఈ మూడు భాష‌ల హిట్ సినిమాల‌తో సాయిప‌ల్ల‌విని ఎప్పుడో ఓన్ చేసుకున్నారు.

  sai pallavi, heroine, సాయిపల్లవి
  Heroine Sai Pallavi


  ఇక బాలీవుడ్ సినిమాలంటారా? ఇప్పుడు అక్క‌డున్న శ్ర‌ద్ధాక‌పూర్‌గానీ, ఆలియాగానీ పెద్ద హైట్‌, ఫిజిక్ ఉన్న‌వాళ్లేం కాదు. వాళ్ల‌క‌న్నా సాయిప‌ల్ల‌వి కూడా అంతేం తీసిపోదు. పైగా డ్యాన్సులు కూడా ఇర‌గ‌దీస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో ఓ సారి ప్ర‌భాస్ కూడా త‌న‌కు సాయిప‌ల్ల‌వి రీసెంట్ టైమ్స్ లో న‌చ్చింద‌న్న‌ట్టు గుర్తు. సో ఇన్ని ఈక్వేష‌న్స్ ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో బ్లెండ్ చేస్తే... స‌లార్‌లో సాయిప‌ల్ల‌వి అనే మాట క్రేజీగానూ, క‌ల‌ర్‌ఫుల్‌గానూ ఉంది. ఏం డార్లింగ్స్... మీ ఒపీనియ‌న్ కూడా ఇదే క‌దా... అన్న‌ది సోష‌ల్ మీడియాలో ప‌ర‌స్ప‌రం ఒక‌రితో ఒక‌రు డిస్క‌స్ చేసుకుంటున్న వైర‌ల్ విష‌యం.
  Published by:Anil
  First published:

  అగ్ర కథనాలు