ఆలియా భట్ విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం.. ?

రాజమౌళికి ఆలియాభట్ ఫోన్ (Instagram/Photo)

బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’ అదేనండి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందునుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆలియాను తప్పించాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టు సమాచరాం.

 • Share this:
  బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’ అదేనండి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందునుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఐతే.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఇప్పటికే ఆమెపై కొన్ని సన్నివేశాలను రాజమౌళి పిక్చరైజ్ చేసాడు కూడా. ఇంతలోనే కరోనా వచ్చి మొత్తం షెడ్యూల్ అప్‌సెట్ అయింది. ఇప్పటికే ప్రభుత్వం షూటింగ్స్ పర్మిషన్స్ ఇచ్చిన హీరోలు ఇప్పట్లో షూటింగ్స్ రానని తెగేసి చెప్పేసారు. ఇంతలోనే ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్యకు కరోనా సోకింది. ఇప్పటికే రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దానయ్య కరోనాకు చికిత్స్ తీసుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా తీసుకున్న ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతుందనుకుంటే.. ఇపుడు ఆమెతో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతకీ అదేమిటో కాదు.. బాలీవుడ్ నెపోటిజం.సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో నెపోటిజం ముఖ్యంగా ఆలియా భట్, కరణ్ జోహార్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

  https://telugu.news18.com/news/movies/rakhi-sawant-sensational-comments-on-sushant-singh-rajput-suicide-ta-541580.html
  రాజమౌళికి ఆలియాభట్ ఫోన్ (Instagram/Photo)


  ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తికి ఆలియా భట్ తండ్రి మహేష్ భట్‌కు ఉన్న రిలేషన్ కూడా ఈ సందర్భంగా బయటపడింది. వీళ్ల వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఇప్పటికే ఎన్‌ఫోర్స్ ‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి సుశాంత్ ఆత్మహత్యకు ముందు ఆయ అకౌంట్ నుంచి ఎలాంటి లావాదేవీలు జరిగాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఈడీ ..సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తిని దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు.ఒక వైపు ఈ విచారణ జరగుతున్న సమయంలో మహేష్ భట్ చాలా యేళ్ల తర్వాత ఆయన  దర్శకత్వంలో తెరకెక్కిన ‘సడక్ 2’ ట్రైలర్ విడుదలైంది.

  Sushant singh Rajput case updates, Actress Rhea Chakraborty news, Rhea Chakraborty investigations, Rhea Chakraborty phone call data, aamir khan, rana daggubati, Shraddha Kapoor, rakul preet singh, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు, రియా చక్రవర్తి, రియా చక్రబర్తి, ఆమిర్ ఖాన్, రానా దగ్గుబాటి, శ్రద్ధా కపూర్
  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రబర్తి (Twitter/photo)


  ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆదిత్యా రాయ్ కపూర్, పూజా భట్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో  నటించారు. ఈ ట్రైలర్ మోస్ట్ డిస్‌లైక్డ్ ట్రైలర్‌గా యూట్యూబ్‌లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఆలియాభట్ కుటుంబంపై ప్రేక్షకుల్లో, ప్రజల్లో ఎంతో నెగిటివిటి ఉందో పూర్తిగా స్పష్టమైంది. మొత్తంగా సుశాంత్ ఆత్మ హత్యకు కారణం అని చెబుతున్న ఆలియా భట్, మహేష్ భట్  పై సినీ ప్రేమికులు ఈ రకంగా తమ పగను కసితీరా డిస్ లైక్ చేసి తీర్చుకున్నారని అందరు చెప్పుకుంటున్నారు.ఇపుడీ ఈ ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎక్కడ పడుతుందేమో అని రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌ను భయపెడుతుంది.

  కూతురు ఆలియాతో మహేష్ భట్ Photo : Twitter


  ఇప్పటికే యూపీ, బిహార్‌కు చెందిన కొంతమంది సుశాంత్ అభిమానులు రాజమౌళికి వార్నింగ్ కూడా ఇచ్చారు. బాహుబలి తీసిన మీరంటే మాకు గౌరవం కూడా ఉంది. కానీ ఆలియాను మీ సినిమా నుంచి తొలిగించకపోతే.. మీ సినిమాను యూపీ, బిహార్‌లలో ఎక్కడ రిలీజ్ కానీయ్యమని వార్నింగ్‌లు కూడా వచ్చాయట. ఈ నేపథ్యంలో రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌లో ఆలియా ప్లేస్‌లో మరో బాలీవుడ్ బడా హీరోయిన్‌‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: