లేడీ సూపర్ స్టార్‌గా మారిన నయనతార ఓ క్రేజీ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు తెలుస్తోంది. హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేసిన అంధాధూన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తుండగా, హిందీలో టబు చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో నయనతార చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అందుకు ఆమెకు భారీ పారితోషికం కూడ ముడుతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మరో బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అంధాధూన్ తెలుగు రీమేక్‌లో నటించడానిక నయన్ నో చెప్పినట్టు తెలిసింది. ఈ సినిమాలో టబు క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. అభిమానులు, క్రిటిక్స్ కూడా టబు నటనకు ఫిదా అయ్యారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురానాకు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టును తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాను ఓకే చెప్పిన నయన్.. ఇప్పుడు నో చెప్పినట్టు తెలిసింది. తాను అంత కంఫర్ట్‌గా నటించలేననే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.