టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మీ.. (Manchu Lakshmi) ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన చాలా విషయాల్ని ఆమె.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. యూట్యూబ్ వేదికగా తరచూ హోంటూర్స్, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తనతో పాటు తన కూతరుకు సంబంధిచిన విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి డాన్స్ చేసేవి. ఇద్దరు కలిసి ఆడేవిఏ పాడేవి ఇలా అనేక రకాలు విడియోలను మంచు లక్ష్మీ పోస్టు చేస్తుంటారు. తాజాగా చుడీ దార్ వేసుకొని బొట్టు పెట్టుకొని అందంగా తయారైన వీడియోను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టా(Manchu Lakshmi Instagram) పేజీలో పోస్టు చేశారు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ఫ్యాన్స్ అంతా.. చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. కొందరు అయితే ఏంజల్లా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. మరికొందరు క్యూట్ అంటూ పోస్టు పెట్టారు.
అయితే ఓ నెటిజన్ అయితే.. మంచు లక్ష్మీని ఏకంగా బాలీవుడ్ హీరోయిన్‌తోనే పోల్చేశాడు. టాలీవుడ్ సోనమ్ కపూర్(Sonam kapoor) అంటూ.. మంచు లక్ష్మీపై ప్రశంసలు కురిపించాడు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ అవుతోంది. మరికొందరు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్(Hair Transplantation) చేయించుకున్నారా?. మీ ఫోర్ హెడ్ పై హెయిర్ ఎలా కవర్ చేశారు అంటూ ప్రశ్నించాడు. దీంతో ఇప్పుడు అందరికీ అదే డౌట్ క్రియేట్ అవుతుంది.
View this post on Instagram
ఇటీవలే ఆమె పోస్ట్ చేసిన తన షూ కలెక్షన్స్ సంబంధించిన ఫొటోపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంది. ఆ తర్వాత కూతురుతో కలిసి వర్క్ అవుట్ వీడియో షేర్ చేసింది. దీనిపై కూడా పలువురు మంచు లక్ష్మీపై విమర్శలు గుప్పించారు. పిల్లలతో ఆటలేంటి అంటూ. సీరియస్ అయ్యారు. ఇలా మంచు లక్ష్మీ ఏం పెట్టినా కొందరు మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తూ విమర్శలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.