భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా క్రికెటర్ రాహుల్‌తో తన ప్రేమ విషయాన్ని పుట్టినరోజున అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. వీళ్లిద్దరి మధ్య భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ .. హీరోయిన్ సంగీత బిజ్లానీని ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా..మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్తో పీకలోతు ప్రేమలో మునిగిపోయినట్టు సినీ,క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో భారత క్రికెట్ ఓపెనర్ కెయల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతియా శెట్టి..ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. అంతేకాదు కేఎల్ రాహుల్,అతియా శెట్టి.. ఈ గత కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నట్టు బాలీవుడ్ కోడై కూస్తుంది. అంతేకాదు వీళ్లిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కేెఎల్ రాహుల్‌తో అతియా శెట్టి (ఫేస్బుక్ ఫోటో)
అంతేకాదు వీళ్లిద్దరి పెళ్లికి ఇరు వర్గాలకు చెందిన కుటుంబ సభ్యలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు రాబోయే తన పుట్టినరోజున అతియా శెట్టి ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం. అతియా శెట్టి విషయానికొస్తే.. 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి వీళ్ల ప్రేమకు పెళ్లి అనే శుభం కార్డు ఎపుడు పడుతుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.