హోమ్ /వార్తలు /సినిమా /

Amy Jackson: పెళ్లి కాకుండానే తల్లైనా రామ్ చరణ్ హీరోయిన్.. ఆ తర్వాత ప్రియుడితో బ్రేకప్..

Amy Jackson: పెళ్లి కాకుండానే తల్లైనా రామ్ చరణ్ హీరోయిన్.. ఆ తర్వాత ప్రియుడితో బ్రేకప్..

Amy Jackson Photo : Instagram

Amy Jackson Photo : Instagram

Amy Jackson: ఇంగ్లీష్ నటి అమీజాక్సన్‌ తెలుగు సినిమాలతో పాటు తమిళ హిందీ సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

  ఇంగ్లీష్ నటి అమీజాక్సన్‌ తెలుగు సినిమాలతో పాటు తమిళ హిందీ సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ భామ పెళ్లి కాకుండానే తల్లై వార్తల్లోకి ఎక్కింది. ఇక ఇప్పుడు మరోసారి తన ప్రియుడి బైబై చెప్పినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌ నుంచి దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టిన అమీజాక్సన్‌ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. శంకర్ రోబో 2తో పాటు విక్రమ్ ఐలోను నటించింది. తెలుగులో రామ్ చరణ్ సరసన ఎవడులో కూడా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అమీ జాక్సన్ మొదటి సినిమా 'మద్రాసుపట్నం'. ఇక ఇటీవల సినిమాల్లో నటించడం తగ్గించేసిన అమీ జాక్సన్.. గత కొన్నేళ్లుగా బ్రిటీష్‌ యువ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయిటోతో ప్రేమలో పడింది. అందులో భాగంగా పెళ్లికాకుండానే రెండేళ్ల క్రితం అమీజాక్సన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.


  ఈ జంటకు సెప్టెంబర్ 23, 2019 న ఓ మగబిడ్డ జన్మించాడు. అతనికి ఆండ్రియాస్ అని పేరు పెట్టారు.పెళ్లి చేసుకోనప్పటికి.. అమీ తనకు పుట్టిన బాబుతో పాటు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను తన సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌తో పంచుకునేది.

  View this post on Instagram


  A post shared by Amy Jackson (@iamamyjackson)  View this post on Instagram


  A post shared by Amy Jackson (@iamamyjackson)  ఈ జంట గత ఏడాది గ్రీస్‌లో వైభవంగా పెళ్లికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా వారి పెళ్లి జరగలేదు. మే 6, 2019 న నిశ్చితార్థం చేసుకున్నారు.  ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ ఇద్దరు విడిపోయారని టాక్. దీనికి తోడు అమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో జార్జ్‌ పనాయిటోతో కలిసి ఉన్న ఫొటోస్ అన్నింటిని తొలగించింది. దీంతో ఈ జంట విడిపోయి ఉంటారని చర్చించుకుంటున్నారు వారి అభిమానులు. అయితే ఈ బ్రేకప్ విషయంలో అమీ జాక్సన్ ఇంతవరకు ఎటువంటీ ప్రకటన చేయలేదు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ram Charan, Tollywood news

  ఉత్తమ కథలు