Dia Mirza: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా వయసు మీరిన ముదురు హీరోలపై సంచనల వ్యాఖ్యలు చేయడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీ అంటేనే హీరో పేరు మీదుగానే బిజినెస్ జరగుతోంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీ మొత్తం మేల్ డామినేట్ అనే చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు కూడా తమ మనవరాళ్ల ఏజ్ ఉన్న హీరోలతో రొమాన్స్ చేసిన సందర్భాలున్నాయి. ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు తమ కంటే చాలా తక్కువ ఏజ్ ఉన్న హీరోలతో నటించినా.. ప్రేక్షకులు ఆదించారు. ఇపుడు కూడా రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు కూడా 60 ఏళ్లు దాటినా.. పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏజ్ గ్యాప్ అనేది బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లోనే ఎక్కువ అనే చెప్పాలి.
తాజాగా ఈ ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్‌తో హీరోల రొమాన్స్ పై దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 50 ఏళ్లు వయసు మీరిన హీరోల సరసన 19 ఏళ్ల వయసున్న హీరోయిన్ పక్కన జోడిగా నటించడం చాలా విడ్డూరం అంది. అంతేకాదు ఇదెక్కడి న్యాయం అంటూ కాస్తంత ఆశ్యర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు మన దగ్గర హీరోలు వయసు పై పడిన హీరోలు ఇంకా యువకుల పాత్రల్లో నటించడం దురదృష్టకరమన్నారు. బాలీవుడ్ సహా సినీ ఇండస్ట్రీ మొత్తం పురుషాధిక్య ఇండస్ట్రీ అని ఆమె వ్యాఖ్యానించింది. మన దగ్గర ఏజ్ అయిపోయిన హీరోయిన్స్ దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు స్టోరీలు రాయడం లేదంది. అంతేకాదు ఏజ్ అయిపోయిన నటుల కోసమే మన దగ్గర రచయితలు స్టోరీలు రాస్తున్నట్టు దుయ్య బట్టింది. దురదృష్ణవశాత్తు ఇది అసలైన సత్యం అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.
నీనా గుప్తా లాంటి కొందరికి మాత్రమే వయసు మీరినా ... ఆమె ఏజ్‌కు తగ్గ పాత్రలు వస్తున్నాయని దియా పేర్కొంది. కానీ మిడిల్ ఏజ్ హీరోయిన్స్ మాత్రం అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారని చెప్పింది. మొత్తంగా ఇన్ని కామెంట్స్ చేసిన దియా మీర్జా వయసు 39 ఏళ్లు. ఇపుడామె తనకంటే దాదాపు 20 ఏళ్లు పెద్ద .. 60 ఏళ్లు పై పడిన నాగార్జున సరసన ‘వైల్డ్ డాగ్’ మూవీ చేయడానిక ఎందుకు ఓకే చెప్పినట్టో అని అందరు ఆమె తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Dia Mirza, Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie