హోమ్ /వార్తలు /సినిమా /

Dia Mirza Marriage: సింగర్ సునీత బాటలో రెండో పెళ్లి చేసుకున్న నాగార్జున భామ దియా మీర్జా..

Dia Mirza Marriage: సింగర్ సునీత బాటలో రెండో పెళ్లి చేసుకున్న నాగార్జున భామ దియా మీర్జా..

వైభవ్ రేఖితో దియా మీర్జా రెండో వివాహాం (Instagram/Photo)

వైభవ్ రేఖితో దియా మీర్జా రెండో వివాహాం (Instagram/Photo)

Dia Mirza Second Marriage: సినీ ఇండస్ట్రీలో ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది.

  Dia Mirza Second Marriage: సినీ ఇండస్ట్రీలో ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. కొందరు విడిపోయాకా.. ఒంటరి జీవితం గడపాలనుకోవడం లేదు. వెంటనే రెండో పెళ్లికి సిద్దమైపోతున్నారు. పిల్లలు పెద్దవారైనా తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకొని సంచలనం రేపింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ సోమవారం రాత్రి పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెరమనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

  ఈ వివాహా వేడుకకు 50 మంది గెస్టులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి మలైకా అరోరా, అతిథి రావు హైదరీ, జాకీ భగ్నానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు.  దియా మీర్జా, వైభవ్‌లకు ఇది రెండో పెళ్లి. దియా మీర్జా 2014లో ఢిల్లీ బిజినెస్ మెన్ సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకుంది దియా మీర్జా. వీరి పెళ్లి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలో దియా మీర్జా సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది.


  దానికి కొన్నేళ్ల ముందు నుంచే వాళ్లిద్దరూ సహజీవనం చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2014 అక్టోబర్‌లో ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు 11 ఏళ్ల తర్వాత తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది దియా మీర్జా.  ఈమె హిందీలో దాదాపు 30 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె తన పెళ్లి సందర్భంగా వచ్చిన అతిథిలకు స్వయంగా స్వీట్లు అందించడం విశేషం.  ఈమె ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఆయన భార్యపాత్రలో నటిస్తోంది.  ఈసినిమా త్వరలో విడుదల కానుంది. మొత్తంగా రెండో పెళ్లి చేసుకున్న దియా మీర్జాకు సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Dia Mirza, Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie

  ఉత్తమ కథలు