Home /News /movies /

DHRUVA SARJA PUSHPARAJ MOVIE RELEASE DATE FIX SLB

పుష్పరాజ్ రిలీజ్ డేట్ ఇదే..! అర్జున్ సర్జా మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ

PushpaRaj Photo twitter

PushpaRaj Photo twitter

Dhruva Sarja: ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Hyderabad
సినిమారంగంలో తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా అడుగు పెట్టిన బొడ్డు అశోక్ (Boddu Ashok).. ధ్రువ సర్జా (Dhruva Sarja), రచిత రామ్ హరిప్రియ (Rachitha Ram Haripriya) జంటగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' (Pushparaj) చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారద్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. "భార్జరీ సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టారు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.

అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప" సినిమాతో పుష్పరాజ్ అనే పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో.. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆగస్టు 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మా చిత్రాన్ని సక్సస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు