‘సర్కారు వారి పాట’లో మహేష్‌కు విలన్‌గా ఆ సూపర్ స్టార్..?

Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు.. ఇంకా తీసుకుంటున్నాడు కూడా. దానికి తోడు కరోనా కూడా రావడంతో అన్నీ అలా కలిసొచ్చాయి ఆయనకు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 4:30 PM IST
‘సర్కారు వారి పాట’లో మహేష్‌కు విలన్‌గా ఆ సూపర్ స్టార్..?
మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  • Share this:
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు.. ఇంకా తీసుకుంటున్నాడు కూడా. దానికి తోడు కరోనా కూడా రావడంతో అన్నీ అలా కలిసొచ్చాయి ఆయనకు. ఇదిలా ఉంటే ఈ మధ్యే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాని మొదలు పెట్టాడు సూపర్ స్టార్. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని దర్శకుడు ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇంకా క్యాస్ట్ అండ్ క్ర్యూ ఎవరూ ఫైనల్ కాలేదు. దానికితోడు కథ కూడా పక్కా కమర్షియల్ కోణంలో జరుగుతుంది కాబట్టి క్యాస్టింగ్ కూడా భారీగానే ఉండబోతుందని తెలుస్తుంది.
మహేష్ బాబు అరవింద్ స్వామి (mahesh babu aravind swamy)
మహేష్ బాబు అరవింద్ స్వామి (mahesh babu aravind swamy)


ముఖ్యంగా విలన్ పాత్ర కోసం ముందు ఉపేంద్రను తీసుకోవాలని ప్లాన్ చేసాడు దర్శకుడు పరశురామ్. కథ విని ఆయన కూడా బాగానే ఎగ్జైట్ అయ్యాడు. అయితే అంతలోనే లాక్‌డౌన్.. కరోనా వైరస్ గ్యాప్ రావడంతో ఆయన కుదర్లేదు. ఇతర సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వడంతో క్లాష్ అయ్యాయి. అందుకే ఉపేంద్ర తప్పుకున్నాడని తెలుస్తుంది. అయితే ఉపేంద్ర ఖాళీ చేసిన స్థానాన్ని మరో కన్నడ సూపర్ స్టార్ సుదీప్‌తో భర్తీ చేయాలని చూసినా కూడా అది కూడా కుదర్లేదు. దాంతో అరవింద్ స్వామిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.
మహేష్ బాబు అరవింద్ స్వామి (mahesh babu aravind swamy)
మహేష్ బాబు అరవింద్ స్వామి (mahesh babu aravind swamy)

ధృవ సినిమాలో స్టైలిష్ విలన్‌గా రప్ఫాడించిన అరవింద్ స్వామి సర్కారు వారి పాట చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఇప్పటికీ ధృవ విలన్ అంటారు ఈయన్ని. ఇప్పుడు మహేష్ బాబు కోసం బ్యాడ్ బాయ్‌గా మారబోతున్నాడు అరవింద్ స్వామి. తన పాత్ర బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తుంది. ఇది ఆర్థిక నేరగాడి పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం అందుకోబోతున్నాడు అరవింద్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ జోడీ భరత్ అనే నేను సినిమాలో నటించారు.
Published by: Praveen Kumar Vadla
First published: June 25, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading