హోమ్ /వార్తలు /సినిమా /

Nani Dasara: దోస్తులతో నాచురల్ స్టార్ ధూమ్ ధామ్! మాస్ మసాలా గురూ..

Nani Dasara: దోస్తులతో నాచురల్ స్టార్ ధూమ్ ధామ్! మాస్ మసాలా గురూ..

Nani Dasara

Nani Dasara

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దసరా పండగ సందర్భంగా నాని స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఆయన తాజా చిత్రం 'దసరా' (Dasara) సినిమా నుంచి 'ధూమ్ ధామ్ దోస్తాన్' (Dhoom Dhaam Dhosthaan) అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దసరా పండగ సందర్భంగా నాని (Hero Nani) స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఆయన తాజా చిత్రం 'దసరా' (Dasara) సినిమా నుంచి 'ధూమ్ ధామ్ దోస్తాన్' (Dhoom Dhaam Dhosthaan) అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఊర మాస్ స్టెప్పులతో నాని అదరగొట్టాడు. ఈ పాటకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గన్నోరా దాస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నల్గొండ గద్దర్ ఆలపించారు. ఈ పాటలో నాని తొలిసారి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. దోస్తులతో ధూమ్ ధామ్ చేశారు నాని.

తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ దసరా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్‌ యాక్షన్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాపై నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవల 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ హిట్ అయింది. శ్యామ్ సింగరాయ్ సినిమాతో పలకరించిన నాని.. రీసెంట్ గా 'అంటే సుందరానికి' సినిమాతో పలకరించారు. ఇప్పుడు దసరా అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో ఈ సినిమా ప్రత్యేకం కానుందని టాక్. ఇందులో డిఫరెంట్ లుక్ లో నాని కనిపించబోతున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Hero nani, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు