హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్‌‌ ఢీ డాన్సర్ అక్సా ఖాన్ మధ్య కొత్త యాంగిల్ ఇదే..రష్మీ సీరియస్...

సుడిగాలి సుధీర్‌‌ ఢీ డాన్సర్ అక్సా ఖాన్ మధ్య కొత్త యాంగిల్ ఇదే..రష్మీ సీరియస్...

సుధీర్, అక్సాఖాన్

సుధీర్, అక్సాఖాన్

ఢీ షో ద్వారా డాన్సర్ గా పరిచయం అయిన అక్సాఖాన్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే అక్సా ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ లో సుధీర్ కి ఇష్టం ఐతే రష్మీని ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఓపెన్ అయిపోయింది.

సుడిగాలి సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై ఒక సంచలనం అనే చెప్పాలి. జబర్దస్త్ ద్వారా పరిచయం అయిన సుధీర్ ప్రస్తుతం తెలుగు టెలివిజన్ పై సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు. జబర్దస్త్ లో ఎదురు లేని సుధీర్ ప్రస్తుతం ఢీ షోలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడం అలవాటే. అటు సినిమాల్లో కూడా చాన్సులు సంపాదిస్తూ నెమ్మదిగా షారుఖ్ ఖాన్ తరహాలో బుల్లితెర నుంచి వెండితెర సూపర్ స్టార్ అయ్యేందుకు పయనిస్తున్నాడు. అయితే సుధీర్ అనగానే గుర్తొచ్చే మరోపేరు రష్మీ, టీవీ సీరియల్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రష్మీ, ప్రస్తుతం ఢీ షోలో సుధీర్ కు జోడీగా యాంకరింగ్ చేస్తోంది. అయితే సుధీర్, రష్మీ కెమిస్ట్రీ ఢీ షోకు ప్రత్యేక అసెట్ అనే చెప్పాలి. అయితే సుధీర్, రష్మీ పెళ్లి గుసగుసలు కూడా సోషల్ మీడియాకు అలవాటే, ఈ సంగతి సుధీరే స్వయంగా చెప్పాడు. ఇక అభిమానుల ముచ్చట తీర్చడం కోసం మల్లెమాల ఎంటర్ టైన్మెంట్ ఇప్పటికే వీరిద్దరీకీ పెళ్లి చేసి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి సక్సెస్ గా టీఆర్పీలు రాబట్టుకుంది. అయితే సుధీర్ క్రేజ్ మాత్రం సినిమాల్లోకి వెళ్లిన తర్వాత అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా సుధీర్ ఫాలోయింగ్ పెరిగింది. రష్మీ తర్వాత సుధీర్ పక్కన కెమిస్ట్రీ పండించిన మరో యాంకర్ విష్ణుప్రియ, వీరిద్దరి గుసగుసలు కూడా పూర్తి అయ్యాక, కొత్తగా మరో కేరక్టర్ ఎంటర్ అయ్యింది.

ఢీ షో ద్వారా డాన్సర్ గా పరిచయం అయిన అక్సాఖాన్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే అక్సా ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ లో సుధీర్ కి ఇష్టం ఐతే రష్మీని ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఓపెన్ అయిపోయింది. అయితే సుధీర్ కూడా అక్సా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా సుడిగాలి సుధీర్ నటిస్తున్న సినిమాలో అక్సా ఖాన్ కొరియోగ్రాఫర్ గా తెరంగేట్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి వ్యవహారం ఎంత వరకూ సాగుతుందా అని సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు.

First published:

Tags: Anchor rashmi gautam, Dhee Dance Reality Show, Jabardasth comedy show, Sudigali sudheer

ఉత్తమ కథలు